Headlines

నేను కెప్టెన్ పీస్ రా భయ్.. రోహిత్‌కు డిప్యూటీగా నేనుండన్న బుమ్రా.. ముంబైని వీడనున్నాడా..?


Jasprit Bumrah MI News: ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2027 సీజన్ కోసం రోహిత్ శర్మను మళ్లీ కెప్టెన్‌గా నియమించి సంచలనం సృష్టించింది. రిటెన్షన్ విండోలో హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేయడంతో రోహిత్‌కు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఆఫర్ ఇవ్వగా.. అతను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

రోహిత్‌కు డిప్యూటీగా నో చెప్పిన బుమ్రా..

ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం.. ఐపీఎల్ 2027 సీజన్ కోసం ముంబై ఇండియన్స్ వైస్ కెప్టెన్‌గా ఉండే ఆఫర్‌ను బుమ్రా వద్దన్నాడు. రోహిత్ శర్మను రెగ్యులర్ కెప్టెన్‌గా ప్రకటించిన వెంటనే ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. అయితే శర్మకు డిప్యూటీగా ఉండేందుకు బుమ్రా ఎందుకు నిరాకరించాడన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఎక్కువమంది చదివినది: Mohammed Siraj: 6 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మహమ్మద్ సిరాజ్‌.. అదేంటంటే?

ఇవి కూడా చదవండి



గతంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయంతో చాలా మ్యాచ్‌లకు దూరమైనప్పుడు.. బుమ్రాకు స్టాండ్-ఇన్ కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చారు. అప్పుడు బుమ్రా సరదాగా.. “MI కెప్టెన్ కాకముందే టెస్టు కెప్టెన్ అవుతానని అనుకోలేదు” అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

రూ.18 కోట్లకు రిటెన్.. అయినా వీడుతున్నాడా..?

33 ఏళ్ల బుమ్రాను ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఏకంగా రూ.18 కోట్లకు రిటెన్ చేసుకుంది. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి బుమ్రా ముంబైతోనే ఉన్నాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ఐదు టైటిళ్లు గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్ హిస్టరీలోనే గొప్ప పేసర్లలో ఒకడిగా ఉన్నా.. గత సీజన్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.

ఎక్కువమంది చదివినది: Team India: ముగ్గురు భారత ఆటగాళ్లకు షాక్.. వన్డే జట్టులో ఇకపై నో ఎంట్రీ..?

ఐపీఎల్ 2026లో 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి 102.50 సగటుతో తన కెరీర్‌లోనే చెత్త సీజన్‌ను నమోదు చేశాడు.

మెగా వేలంలోకి బుమ్రా..?

వైస్ కెప్టెన్సీని తిరస్కరించడంతో బుమ్రా వచ్చే ఏడాది మెగా వేలంలోకి వెళ్లి వేరే టీమ్‌ను ఎంచుకుంటాడన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2028 సీజన్ కోసం జట్టు మారతాడని ఫ్యాన్స్, నిపుణులు చర్చిస్తున్నారు. అయితే జట్టు మారతానని బుమ్రా మాత్రం ఇప్పటివరకు ఎలాంటి కోరికను వ్యక్తం చేయలేదు.

మరి రోహిత్-బుమ్రా కాంబోలో ముంబై ఐపీఎల్ 2027లో ఎలా రాణిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *