Headlines

40 ఏళ్లు దాటిన మహిళలూ.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 పోషకాలు తప్పక తీసుకోండి!


కుటుంబం, వృత్తి బాధ్యతల మధ్య మహిళలు తరచుగా తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మర్చిపోతుంటారు. 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో మార్పులు మొదలవుతాయి. మునుపటిలా శక్తి లేకపోవడం, నిరంతర అలసట, జుట్టు రాలడం, ఎముకల నొప్పులు, నెలసరి సమస్యలు, మూడ్ స్వింగ్స్, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని కేవలం వయసు రీత్యా వచ్చేవిగా భావించకుండా, ఆహారంలో మార్పులు చేసుకోవడం ముఖ్యమని వైద్య నిపుణులు సూచించారు. మహిళలు తమ ఆహారంలో చేర్చుకోవాల్సిన ముఖ్యమైన పోషకాలు, విత్తనాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే..

హలీం విత్తనాలు: తరచుగా నీరసంగా అనిపిస్తున్నా, జుట్టు ఎక్కువగా రాలుతున్నా హలీం విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. రోజుకు అర చెంచా హలీం విత్తనాలు తీసుకోవచ్చు లేదా లడ్డూల రూపంలో తినవచ్చు.

ఉసిరి : విటమిన్ సి సమృద్ధిగా లభించే ఉసిరి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని యవ్వనంగా, బిగుతుగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని పచ్చిగా లేదా పచ్చడి రూపంలో తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



అవిసె గింజలు: నెలసరి సమయంలో మూడ్ స్వింగ్స్ లేదా పీఎంఎస్ సమస్యలతో బాధపడేవారికి అవిసె గింజలు ఉపయోగపడతాయి. వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. వీటిని వేయించి సలాడ్లు లేదా కూరలలో కలుపుకుని తినవచ్చు.

నువ్వులు, గుమ్మడి గింజలు: ఎముకల ఆరోగ్యానికి, అండాశయాల మద్దతుకు నువ్వులు, గుమ్మడి గింజలు ఎంతో అవసరం. నువ్వులలో క్యాల్షియం అధికంగా ఉండగా, గుమ్మడి గింజలలో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, హార్మోన్లను నియంత్రించడం, నెలసరికి ముందు వచ్చే నొప్పులను తగ్గించడంలో తోడ్పడతాయి. వీటిని వేయించి, లడ్డూలుగా లేదా పొడి చేసి ఆహారంలో చేర్చుకోవచ్చు.

డార్క్ చాక్లెట్: కనీసం 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉండే డార్క్ చాక్లెట్‌ను చిన్న ముక్క పరిమాణంలో రోజూ తీసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. ఈ పోషకాలను క్రమం తప్పకుండా సరైన మోతాదులో ఆహారంలో చేర్చుకోవడం ద్వారా 40 ఏళ్ల తర్వాత కూడా మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *