రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ అదిరిపోయే గుడ్న్యూస్ చెప్పింది. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు బ్యాంకింగ్ పరీక్షల కోసం ఉచితంగా కోచింగ్ ఇవ్వనుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కోసం ప్రొబేషనరీ ఆఫీసర్స్, క్లర్క్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పథకంలో మొత్తం 100 సీట్లు కేటాయించగా.. అందులో 75 ఎస్టీలకు, 15 ఎస్సీలకు, 10 బీసీలకు కేటాయించారు. అలాగే మొత్తం సీట్లలో 33% శాతం మహిళలకు రిజర్వ్ చేశారు. 75 రోజుల పాటు కోచింగ్ ఉంటుంది. మే 20 నుంచి హైదరాబాద్లోని PETC కేంద్రంలో తరగతులు ప్రారంభమవుతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్స్ కోసం దరశాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాంకింగ్ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని ఉండాలి. వారి డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం కార్యాలయ పని వేళల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Paytm: పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. లైసెన్స్ రద్దు
రాష్ట్రంలోనే తొలి ‘హెల్మెట్ బ్యాంక్’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా ??
Shakti App: అర్ధరాత్రి వేళ.. యువతిని కాపాడిన శక్తి యాప్
పులిగుండాల అడవుల్లో చిరుతలు.. ట్రాప్ కెమెరాలో అరుదైన దృశ్యాలు
Jio: జియో నుంచి వారి కోసం స్పెషల్ గా రూ.459 సరికొత్త ప్లాన్..!