నటరత్న నందమూరి తారక రామారావు గారు తన ఇరవయ్యవ ఏట, మేనమామ కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె బసవతారకమును 1942 మే 2 తెల్లారి 3:23 నిమిషాలకు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని కొమరవోలులో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఎనిమిది మంది మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. ఎన్టీఆర్ హరిహరనాథ తత్వాన్ని విశ్వసించి, తన మగపిల్లలకు రామకృష్ణ, జయకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర కృష్ణ అని; ఆడపిల్లలకు లోకేశ్వరి, పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి అని శైవ నామధేయాలు పెట్టారు. వీరిలో పెద్ద కుమారుడు రామకృష్ణ. రామకృష్ణ తండ్రి అంత పొడవు, అందగాడు. చిన్నాన త్రివిక్రమరావు శిక్షణలో వ్యాపార మెళకువలు నేర్చుకున్నాడు. ఎవరినీ తిట్టడం, బిగ్గరగా అరవడం ఎరుగడు. తండ్రికి కుడి భుజంలా, పినతండ్రికి నీడలా ఇంట్లో విషయాలు, ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకునేవాడు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఇంటికి ఫోన్ చేసిన వారికి ఆయన గొంతులో మార్ధవం, నమ్రత, మర్యాద తెలిసేది. చెన్నై బజుల్లా రోడ్డులోని నందమూరి హౌస్కు ఎవరైనా వస్తే, రామకృష్ణ వారిని ఆప్యాయంగా పలకరించి గౌరవించేవాడు.
1962 మే 20న రామకృష్ణ నిమ్మకూరు వెళ్లారు. వెళ్లే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించారు. సరిగ్గా వారం రోజుల తర్వాత, మే 27న, 17 ఏళ్ల వయసులో మశూచి కారణంగా ఆయన అకాల మరణం చెందారు. ఈ వార్త విన్నప్పుడు ఎన్టీఆర్ ఇరుగు పొరుగు చిత్రం షూటింగ్లో ఉన్నారు. షూటింగ్ ఆపకుండానే, గంభీరంగా పనిచేశారు. మేకప్ తీయగానే కన్నీళ్లు ఆగలేదు. తన సినిమా మహామంత్రి తిమ్మరుసులోని సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ, మశూచి వల్ల దెబ్బతిన్న కుమారుడి శరీరాన్ని చూడటానికి నిరాకరించారు. రామకృష్ణ పేరు చిరస్మరణీయం చేయడానికి, బాలకృష్ణ తర్వాత పుట్టిన కుమారునికి రామకృష్ణ అని పేరు పెట్టారు ఎన్టీఆర్. ఆయన జ్ఞాపకార్థం తన నిర్మాణ సంస్థను రామకృష్ణ-ఎన్.ఏ.టి. కంబైన్స్ గా మార్చారు.
అప్పట్లో ముగ్గురు చిరంజీవుల సీన్లు ఎలా తీశారో తెలుసా..?