సూర్యకి గుండుగీయించి ఊరేగిస్తాం.. దర్గా చిన్న పహిల్వాన్ వార్నింగ్

సూర్యకి గుండుగీయించి ఊరేగిస్తాం.. దర్గా చిన్న పహిల్వాన్ వార్నింగ్


హైదరాబాద్‌లో ‘గోల్డ్ మ్యాన్’ల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. తనపై వస్తున్న అసత్య ఆరోపణలపై స్పందించిన దర్గా చిన్న పహిల్వాన్, ఓల్డ్ సిటీకి చెందిన సూర్య భాయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సూర్య ధరించిన ఆభరణాలు కేవలం ‘1 గ్రాము బంగారు పూత’ అని తేలడంతో, ఈ వ్యవహారం నగరంలో పెద్ద దుమారమే రేపింది. ఈ సందర్భంగా చిన్న పహిల్వాన్ ఏం చెప్పారంటే.. సూర్య కారణంగా నిజమైన గోల్డ్‌మ్యాన్‌లు బద్నామ్‌ అవుతున్నారని మండిపడ్డారు. సూర్య ధరించిన బంగారం ఫేక్ అని తేలడంతో, తనపై సోషల్ మీడియా వేదికగా లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. అసలైన గోల్డ్ మ్యాన్ల ప్రతిష్టను సూర్య దెబ్బతీస్తున్నాడని విమర్శించారు. ఒకప్పుడు సూర్య తన దగ్గరికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నాడని వివరించారు. ఇప్పుడు తను దొరికిపోయాక, అక్కసుతో తనపై బురద జల్లుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సూర్య వీడియోలు చూసి తన అనుచరులు ఆగ్రహంతో అతని ఇంటిపై దాడి చేశారని చిన్న పహిల్వాన్‌ తెలిపారు. ఇప్పటికైనా తనపై ఇటువంటి అసత్య ఆరోపణలు ఆపకపోతే చూస్తూ ఊరుకోనని వార్నింగ్‌ ఇచ్చారు. సూర్యకు గుండు గీయించి ఊరేగిస్తామని చిన్న పహిల్వాన్ హెచ్చరించారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: సెగలు పుట్టిస్తున్న సూర్యుడు.. అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల జనం

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌..! తెలంగాణ లో ఉచిత బ్యాంకింగ్ కోచింగ్

Paytm: పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. లైసెన్స్ రద్దు

రాష్ట్రంలోనే తొలి ‘హెల్మెట్ బ్యాంక్’ ప్రారంభం.. ఎక్కడో తెలుసా ??

Shakti App: అర్ధరాత్రి వేళ.. యువతిని కాపాడిన శక్తి యాప్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *