Pan Card: పాన్ కార్డు రూల్స్‌లో మార్పులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ.. ఇక నుంచి..

Pan Card: పాన్ కార్డు రూల్స్‌లో మార్పులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ.. ఇక నుంచి..


దేశంలో ఆర్ధిక కార్యకాలాపాల నిర్వహణకు పాన్ కార్డు అనేది ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ కార్డు లేకపోతే ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించలేము. అందుకే పాన్ కార్డు అనేది ఆర్దిక లావాదేవీల కోసం ప్రతీఒక్కరికీ అవసరం అని చెప్పవచ్చు. బ్యంకుల్లో రూ.50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయాలన్నా పాన్ అవసరం. ఇక జీతం పొందాలన్నా పాన్ కార్డు అవసరమే. ఇలా అనేక పనులకు పాన్ తప్పనిసరి చేశారు. అయితే ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు రూల్స్‌లో భారీ మార్పులు చోటచేసుకున్నాయి. దరఖాస్తు విధానంలో అనేక మార్పులను ఆదాయపు పన్ను శాఖ తీసుకొచ్చింది. దరఖాస్తు ప్రక్రియలను మరింత సులభతరం చేయడంతో పాటు నూతన వ్యవస్థను ప్రవేశపెట్టారు. పాత దరఖాస్తు స్థానంలో కొత్త అప్లికేషన్లను తీసుకొచ్చారు. ఇక వివిధ వర్గాలకు అనుకూలంగా దరఖాస్తుల్లో మార్పులు తెచ్చారు.

ఎవరికి ఏ దరఖాస్తులు..?

భారతదేశంలోని పౌరుల కోసం ఫారం 93 తీసుకొచ్చారు. ఇక ఇండియాలో విలీనం చేయబడ్డ భారత్ కంపెనీలు, సంస్థలు లేదా భారత్‌లో ఏర్పడిన విలీనం కాని సంస్థల కోసం ప్రత్యేక ఫారం 94 ప్రవేశపెట్టారు. ఇక భారత్ పౌరులు కానివారు ఫారం 95తో పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక భారత్ లోపల విలీనం చేయబడ్డ సంస్థలు, భారత్ వెలుపల ఏర్పడిన విలీనం కాని సంస్థలు ఫారం 96ని ఉపయోగించాలి. సెక్షన్ 158, 262 పరిధిలోకి ఈ ఫారాలు అనేవి వస్తాయి. కొత్త దరఖాస్తుల్లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ వంటి వాటిని తప్పనిసరి చేశారు. వ్యక్తులను గుర్తించేందుకు పెద్ద ఫొటో పరిమాణం వంటివి పొందుపర్చారు. తల్లి పేరు తప్పనిసరి చేశారు. ఇక కొంతమంది దరఖాస్తుదారులకు పాస్ పోర్ట్, టిన్ సంఖ్య తప్పనిసరి చేశారు. సంబోధనలు, పేరు సంక్షిప్తాలు, పునరావృతమయ్యే KYC వివరాల వంటి అనవసరమైన ఫీల్డ్‌లను కొత్త దరఖాస్తుల్లో తొలగించారు. కొత్త దరఖాస్తులు అనేవి అందరిక అర్ధమయ్యేలా సులభమైన భాషలో ఉంటాయి. అవనసరమైన విషయాలను తొలగించారు. ఏప్రిల్ 1 నుంచి పాత దరఖాస్తుల స్థానంలో కొత్త దరఖాస్తులను ప్రవేశపెట్టారు.

పాన్ దరఖాస్తుకు ఏ పత్రాలు అవసరం..?

ఇక నుంచి పాన్ కార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డుతో పాటు ఏదైనా మరో గుర్తింపు ధృవీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. గతంలో ఆధార్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, ఓటర్ ఐటీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ లాంటి అదనపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ రూల్ అందుబాటులోకి వచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *