Headlines

ధురంధర్ బ్యూటీకి ఇన్నాళ్లకు మంచి ఆఫర్ వచ్చిందా..?


“దురందర్” బ్లాక్ బస్టర్ విజయంతో ఓవర్‌నైట్ నేషనల్ క్రష్‌గా మారిన యువ నటి సారా అర్జున్‌కు బాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్ లభించింది. ఆమె యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఓ మ్యూజికల్ లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అన్‌టైటిల్డ్ మ్యూజికల్ రొమాన్స్‌కు మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. “సప్నే వర్సెస్ ఎవ్రీవన్” ఫేమ్ అంబ్రీష్ వర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మొత్తం ఎనిమిది పాటలు ఉండనున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2027 జనవరిలో ప్రారంభం కానుంది. గతంలో “బాండ్ బాజా భారత్”, “శుద్ధ్ దేశీ రొమాన్స్” వంటి యూత్ ఫుల్ హిట్స్ ఇచ్చిన మనీష్ శర్మ, “టైగర్ 3” తర్వాత మళ్లీ తన ఫేవరెట్ రొమాన్స్ జానర్‌లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ కథను “ఆషికీ”, “సయారా” స్టైల్‌లో కాకుండా కొత్తగా ప్రెజెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వైఆర్ఎఫ్ టాలెంట్ వింగ్‌లో చేరిన సారా అర్జున్, సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మధుబాల బయోపిక్ రేసులో కూడా ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాఫీ విత్ కరణ్ షోలో షాకింగ్‌ విషయాలు చెప్పిన అక్షయ్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *