Headlines

భారీ మార్పులతో Maruti Invicto.. ఫ్లెక్స్​ ఫ్యూయల్​ ఇంథన టెక్నాలజీతో మార్కెట్​లోకి వస్తోందా?


టయోటా, మారుతి సుజుకి సంస్థలు గతంలోనూ తమ ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌లపై రూపొందించిన కార్లలో పలు టెక్నాలజీ, ఫీచర్లను పంచుకున్నాయి. ఇటీవల ఇన్నోవా హైక్రాస్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని పరిచయం చేయడంతో ఇప్పుడు ఇన్విక్టోలోనూ ఇదే మార్పు వస్తుందనే అంచనాలు పెరిగాయి. అయితే మారుతి సుజుకి నుంచి ఈ అప్‌డేట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను అంచనాలుగానే చూడాలి.

కొత్త హైబ్రిడ్ ఇంజిన్..

టయోటా ఇన్నోవా హైక్రాస్ అప్‌డేటెడ్ వెర్షన్‌లో E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో పనిచేసే Flex Fuel Strong Hybrid పవర్‌ట్రెయిన్‌ను అందించారు. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, e-CVT గేర్‌బాక్స్ ఉన్నాయి. ఈ హైబ్రిడ్ వ్యవస్థ 197bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే టెక్నాలజీ మారుతి ఇన్విక్టోలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇన్విక్టోలో ఈ మార్పు వస్తే ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి మరో ఎంపిక లభించనుంది.

పెద్ద స్క్రీన్లతో ప్రీమియం లుక్

కొత్త ఇన్విక్టోలో కేవలం ఇంజిన్ మాత్రమే కాకుండా డిజైన్‌లోనూ కొన్ని మార్పులు ఉండవచ్చని అంచనా. కొత్త గ్రిల్, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్స్, టెయిల్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన బంపర్లు, కొత్త కలర్ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇంటీరియర్‌లోనూ ఇన్నోవా హైక్రాస్ తరహాలో టాప్ వేరియంట్లకు 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించవచ్చని సమాచారం. అయితే మారుతి తన రీబ్యాడ్జ్ మోడళ్లలో మార్పులను పరిమితంగా ఉంచే అవకాశం ఉంది.

ప్రస్తుతం మారుతి సుజుకి ఇన్విక్టో Zeta Plus, Alpha Plus వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.25.27 లక్షల నుంచి రూ.28.95 లక్షల వరకు ఉన్నాయి. కొత్త Flex Fuel వెర్షన్ విడుదల తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. ఈ అప్‌డేట్‌ నిజమైతే ఇన్నోవా హైక్రాస్ తర్వాత Flex Fuel Strong Hybrid టెక్నాలజీని పొందే మరో మోడల్‌గా ఇన్విక్టో నిలిచే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *