పీఎఫ్ నగదును విత్‌డ్రా చేసుకోవడం ఇప్పటివరకు రోజుల తరబడి సాగే ఒక సుదీర్ఘ ప్రక్రియగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఉద్యోగుల కోసం EPFO ఒక భారీ డిజిటల్ విప్లవానికి సిద్ధమవుతోంది. ‘EPFO 3.O’ పేరుతో రాబోతున్న ఈ కొత్త వ్యవస్థతో పీఎఫ్ నిధుల విత్‌డ్రా బ్యాంక్ లావాదేవీలంత సులభంగా జరిగిపోతాయి. ఈ కొత్త వ్యవస్థలో అత్యంత కీలకమైన మార్పు ‘PF ATM’ కార్డు. ఇది సాధారణ డెబిట్ కార్డులాగే పనిచేస్తుంది. దీని ద్వారా సమీపంలోని ఏటీఎంలలో నేరుగా నగదు తీసుకోవచ్చు. అంతేకాకుండా, పీఎఫ్ ఖాతాను యూపీఐ (UPI)తో కూడా అనుసంధానించనున్నారు. దీనివల్ల మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో బ్యాంక్ ఖాతాలోకి నిధులను బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఈపీఎఫ్ఓ పోర్టల్, ఉమాంగ్ యాప్ సేవలన్నీ మరింత వేగవంతం కానున్నాయి. ఈ సదుపాయంపై కొన్ని నిబంధనలు ఉంంటాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం, మొత్తం పీఎఫ్ నిల్వల్లో 50% నుండి 75% వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని భావించినా, అమలులో కొంత జాప్యం జరుగుతోంది. త్వరలోనే కొత్త యాప్, పూర్తి స్థాయి సదుపాయాలు అధికారికంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మార్పు అమల్లోకి వస్తే, అత్యవసర సమయాల్లో ఉద్యోగులకు తమ సొంత నిధులు మరింత వేగంగా, సులభంగా అందుబాటులోకి వస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పరిశోధనలో బయటపడిన 2,000 ఏళ్ల నాటి ‘మెషిన్ గన్’
రాజశేఖర్‌తో జగన్‌ను నటించమని అడిగా.. అందుకు ఆయన..?