Headlines

తల్లితో గొడవ.. 3వ ఫ్లోర్ నుంచి సిలిండర్ విసిరేసిన కొడుకు.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదం


తల్లితో గొడవ.. 3వ ఫ్లోర్ నుంచి సిలిండర్ విసిరేసిన కొడుకు.. కట్‌చేస్తే.. ఊహించని ప్రమాదం

దేశరాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ కొడుకు తన తల్లిపై చూపిన కోపం మరో యువకుడి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని బిందాపూర్‌కు చెందిన శివమ్‌ శర్మ అనే యువకుడు స్థానికంగా ఉన్న తన మామయ్య అపార్ట్‌మెంట్‌లో తల్లితో పాటు నివసిస్తున్నాడు. అయితే ఇటీవల శివమ్ తల్లితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే కిచెన్‌లో ఉన్న నిండు గ్యాస్ సిలిండర్‌ను మూడో ఫ్లోర్‌ నుంచి కిందకు విసిరేశాడు.

అయితే అదే సమయంలో ఆ అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నివసిస్తున్న సాహిల్‌ (30) అనే వ్యక్తి భవనం బయట నిలబడి ఉన్నాడు. దీంతో ఆ సిలిండర్ నేరుగా వచ్చి అతని తలకు తగలడంతో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు సాహిల్‌ను వెంటనే దగ్గర్లోని హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. సాహిల్‌కు భార్యతో పాటు ఏడాది వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు.

ఇక బాధితుడి భార్య ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్ట్‌మెంట్ యజమాని మేనల్లుడైన శివమ్‌ శర్మను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. క్షణికావేశంలో శివమ్ తీసుకున్న నిర్ణయం ఓ భార్యకు భర్తను దూరం చేయడమే కాకుండా ఏ పాపం తెలియని ఏడాది బాలుడికి తన తండ్రిని లేకుండా చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *