Headlines

తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము.. హాస్పిటల్‌కు తీసుకెళ్లగా..


తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో తల్లితో కలిసి నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. కల్లకురిచి జిల్లాలోని శంకరపురం సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తొలుత చిన్నారుల మృతిపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. తాజాగా విడుదలైన పోస్టుమార్టం నివేదికలో వారిద్దరూ పాము కాటు వల్లే మరణించినట్లు నిర్ధారణ అయింది.

వివరాల్లోకి వెళ్తే.. కల్లకురిచి జిల్లాలోని మూకనూర్ గ్రామానికి చెందిన చంద్రన్ తన భార్య పుష్ప, ఇద్దరు కుమార్తెలతో కలిసి స్థానికంగా నివసిస్తున్నాడు. వీరికి దేవదర్శిని (3), దేవజనని (1) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే రాత్రి పుష్ప తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఇంట్లోకి దూరిన ఓ నాగుపాము తల్లితో పాటు ఇద్దరు చిన్నారులను కాటు వేసినట్లు తెలుస్తోంది. పాము కాటును గురైన పుష్ప గట్టిగా కేకలు వేయడంతో అలర్ట్ అయిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.

వెంటనే తల్లితో పాటు ఇద్దరు చిన్నారులను 108 అంబులెన్స్‌ సహాయంతో సమీపంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అయితే విష ప్రభావం కారణంగా ఇద్దరు చిన్నారులను చికిత్స పొందుతూ మృతి చెందారు. మరోవైపు తల్లి పుష్పకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం కల్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈ ఘటనలో పెద్ద కుమార్తె దేవదర్శిని శరీరంపై ఎలాంటి పాము కాటు ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇద్దరు చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించగా రిపోర్ట్‌లో ఇద్దరూ పాము కాటు కారణంగానే మరణించినట్లు నిర్ధారణ అయింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు పాము కాటుతో ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *