Headlines

Telangana: సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ పొలిటికల్ రచ్చ


సిద్దిపేట వేదికగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొస్తోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా కల్పిస్తామన్నారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే..ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా ఆదుకోవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ నియమాల ప్రకారం ఈ పథకం కుటుంబంలో ఒక్కరికి వర్తిస్తుంది. ఒక్కరి కంటే ఎక్కువ మంది సంపాదించే సభ్యులు ఉన్న కుటుంబాల్లో ఎవరికి బీమా కల్పించాలన్నది కుటుంబ సభ్యులే నిర్ణయం తీసుకోవాలని అధికారులు అంటున్నారు. బీమా మొత్తం ఎవరికి ఎంత శాతం అందాలన్న విషయాన్ని నామినీల ద్వారా నిర్ణయిస్తారు. ఈ పథకాన్ని గురువారం సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈనెల 20 నుంచి 30 వరకు గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరిస్తారు

సీఎం సిద్ధిపేట పర్యటనపై బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఓ వైపు మాటల తూటాలు పేలుతుంటే.. మరోవైపు ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్ధిపేటపై సీఎం వివక్ష చూపుతున్నారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ నేతలు. సిద్దిపేటలో ఆగిపోయిన పనుల పేరుతో సీఎం పర్యటనకి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వెటర్నరీ కాలేజీ, శిల్పా రామం, వెయ్యి పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, సిద్దిపేట- ఇల్లంతకుంట రోడ్డు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కు నిధులు కేటాయించి అభివృద్ధి సహకరించాలని కోరారు. మాపై వివక్ష చూపకండి, కుట్రలు చేయకండి అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.

సీఎం సిద్ధిపేటకు మూడు సార్లు కాదు ముప్పై సార్లయినా రావొచ్చన్నారు హరీష్‌ రావు, సిద్ధిపేటకు రావాల్సిన అభివృద్ధి పనులను కొడంగల్‌కు తీసుకెళ్లడంపై సభలో సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ అవినీతిని సిద్ధిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి బయటపెడతారంటున్నారు కాంగ్రెస్ నేతలు. సీఎం సిద్ధిపేటకు వస్తే బీఆర్ఎస్‌కు భయమెందుకని ప్రశ్నించారు. సీఎం సభకు ప్రజలను తరలించే పనుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు. సభను సక్సెస్ చేస్తామంటున్నారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *