టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం

టాలీవుడ్‌ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం


టాలీవుడ్‌లో థియేటర్ల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ జెట్లీ సినిమా మల్టీప్లెక్స్ కేటాయింపుల విషయంలో విడుదల చేసిన లేఖ ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీసింది. సింగిల్ స్క్రీన్లలో పర్సెంటేజ్ విధానం అమలుపై నిరసనగా హైదరాబాద్‌లోని 23 థియేటర్లు వ్యవహరిస్తుండటంతో ఈ సమస్య మొదలైంది. ఇది మల్టీప్లెక్స్‌లకు కూడా విస్తరిస్తుందేమోనని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. మైత్రి లాంటి పెద్ద సంస్థకే ఇటువంటి సమస్యలు ఎదురైతే, చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే 16 మంది నిర్మాతలు ఏకమై ఈ విధానానికి వ్యతిరేకంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.మరోవైపు, టికెట్ ధరల పెంపుదల అంశం కూడా పరిశ్రమను కలవరపెడుతోంది. పెద్ద సినిమాలకు రేట్లు పెంచుకోవాలంటే 90 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్‌ను నిలబెట్టేదెవరు..?

ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారుగా.. ఈసారి బాక్సులు బద్ధలే..!

టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్‌లో కొత్త గొడవలు..!

సెంచరీకి చేరువలో సంచలన ప్రయోగం

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *