Headlines

DSP: అటు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. ఇటు హీరోగా..! దేవి శ్రీ పుట్టిన రోజున క్రేజీ అప్డేట్స్.. ఓ లుక్కేసేయండి

DSP: అటు మ్యూజిక్ డైరెక్టర్‌గా.. ఇటు హీరోగా..! దేవి శ్రీ పుట్టిన రోజున క్రేజీ అప్డేట్స్.. ఓ లుక్కేసేయండి


రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టిన రోజు నేడు. తన మ్యూజిక్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక దేవి శ్రీ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవీ మ్యూజిక్ కు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ దేవి శ్రీ తన మ్యూజిక్ తో సత్తా చాటారు. ఇక నేడు దేవి శ్రీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన రాబోయే సినిమాలకు సంబందించిన ఆసక్తికర పోస్టర్స్, అప్డేట్స్ విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొన్ని సినిమాల అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.! కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో కార్తి, మీనాక్షి చౌదరి జంటగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.. ఇది విశేషం కాదు కానీ చాలా ఏళ్ళ తర్వాత త్రివిక్రమ్ కంపౌండ్‌లోకి మళ్లీ దేవీ వచ్చాడు.. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత త్రివిక్రమ్ జోన్‌లోనే దేవీ లేడు.. ఇన్నాళ్లకు మళ్లీ ఆయన భార్య సాయి సౌజన్య నిర్మాతగా ఉన్న ప్రాజెక్టుకు దేవీ సంగీతం అందిస్తున్నారంటే.. త్వరలోనే మళ్లీ త్రివిక్రమ్, దేవీ కాంబినేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటున్నారు అభిమానులు.

సితార ఎంటర్టైన్మెంట్ పోస్ట్ 

ఇవి కూడా చదవండి



అలాగే మన్మథుడు, మాస్, కింగ్ లాంటి సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్‌నే తన 100వ సినిమా కోసం తీసుకున్నారు నాగార్జున.. రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది.. తాజాగా దేవీ శ్రీ ప్రసాద్ బర్త్ డే సందర్భంగా కింగ్ 100 సినిమాలోకి దేవీని ఆహ్వానిస్తూ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్.

అన్నపూర్ణ స్టూడియోస్ పోస్ట్ 

అదేవిధంగా ‘బలగం’ వేణు దర్శకత్వంలో దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఎల్లమ్మ’. ఈ సినిమా కోసం దేవి అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 2న దేవి శ్రీ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఎల్లమ్మ సినిమా నుంచి ఆయన పోషిస్తున్న పార్శి పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసింది యూనిట్.. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి గతంలో విడుదలైన టైటిల్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకుంది. ఎల్లమ్మ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదలకానుంది.

ఎల్లమ్మ సినిమా నుంచి దేవి శ్రీ లుక్ 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *