Headlines

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో దిమ్మతిరిగే తీర్పు.. గెలుపుపై దానం సంచలన వ్యాఖ్యలు!


హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు రాజకీయంగా నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న దానం.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే రీతిలో ఫలితం ఉండబోతుందన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కారణంగా ఈ ఉప ఎన్నిక ఫలితంపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన అన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియను అడ్డుపెట్టుకుని బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకున్నాయని విమర్శించారు.

ఎన్నికల సంఘం పనితీరుపైనా దానం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు.

ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌పై కూడా దానం విమర్శలు గుప్పించారు. బీజేపీకి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చేందుకే బీఆర్‌ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కాగా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద దానం నాగేందర్‌పై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో జరగనున్న ఉప ఎన్నికలో తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు దానం గతంలోనే ప్రకటించారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *