Headlines

ఉలిక్కిపడిన హైదరాబాద్.. ఆర్మీ ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్ల కలకలం.. భారీ కుట్ర..?


హైదరాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. ఆర్మీ కంటోన్మెంట్ పరిసరాల్లోని ఫైరింగ్‌ క్యాంప్‌ దగ్గర 160 డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. బకెట్‌లో దుండగులు డిటోనేటర్లను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. బకెట్‌లో 8 బండిల్స్‌ డిటోనేటర్లు లభ్యమయ్యాయి.. ఒక్కో బండిల్‌లో 20 డిటోనేటర్ల గుర్తించారు. ఆయుధాలు మిస్సింగ్‌ కేసులో తనిఖీలు చేస్తుండగా డిటోనేటర్ల వ్యవహారం బయటపడింది. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేసిన పోలీసులు.. ఆ ప్రాంతంలోని అన్ని పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బొల్లారం పీఎస్‌లో కేసు నమోదు చేసి… డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఇటీవలనే ఏకే 47 తుపాకులు సహా.. పలు పిస్టోళ్ల చోరీ కలకలం రేపిన విషయం తెలిసిందే.. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా.. డిటోనేటర్లు లభ్యమవ్వడం సంచలనంగా మారింది. దుండగలు ఏదో భారీ కుట్రకు తెరలేపినట్లు సమాచారం.. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు..

డిటోనేటర్లు ఎందుకు అక్కడ ఉంచారు, వాటి వెనుక ఎవరున్నారు, ఏదైనా కుట్ర ఉందా అనే అంశాలపై.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *