ఒకప్పుడు తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో చక్రం తిప్పిన హీరోయిన్ ఆమె. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీని ఏలేసింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆమె చేసిన ఒకటి రెండు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే అగ్ర స్థానంలో దూసుకుపోయిన ఈ హీరోయిన్.
ఇప్పటికీ చేతినిండా సినిమాలతో యాక్టివ్ గా ఉంటుంది. కమల్ హాసన్, రజినీకాంత్ లాంటి స్టార్ హీరోలతో నటించింది ఆ అందాల తార. ఆ మధ్య కమల్ తో ఆమె చేసిన లిప్ లాక్ సీన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె పేరు అభిరామి. అసలు పేరు దివ్య గోపీ కుమార్. కేరళలోని త్రివేండ్రంలో జన్మించిన ఆమె.. 1995లో కథాపురుషన్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.
మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వరుస అవకాశాలు అందుకుంది. దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన థాంక్యూ సుబ్బారావ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత చార్మినార్ అనే సినిమాలో కనిపించింది. కానీ వేణు తొట్టెంపూడి జోడిగా చెప్పవే చిరుగాలి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇందులో ఆమె నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన అభిరామి..కొన్నాళ్లకే రీఎంట్రీ ఇచ్చింది. ఎక్కువగా తమిళం, కన్నడ భాషలలో నటించిన ఆమె.. ఇప్పుడిప్పుడే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. మొన్నామధ్య కమల్ హాసన్, డైరెక్టర్ మణిరత్నం కాంబోలో వచ్చిన థగ్ లైఫ్ చిత్రంలో నటించింది. ఈ సినిమాలో కమన్, అభిరామికి మధ్య వచ్చిన లిప్ లాక్ సీన్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అభిరామి. తెలుగుతో పాటు ఇతరభాషల్లోనూ అవకాశాలు అందుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నదాని త్రొబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కమల్ హాసన్ తో కలిసి దిగిన ఈ ఫొటోలో అభిరామి గుర్తుపట్టలేనంతగా ఉంది. ఇప్పుడు కుర్ర హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా అందంతో కవ్విస్తుంది.




