Headlines

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్

ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్


జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల సోషల్ మీడియా వేదికగా ఓ కీలక విజ్ఞప్తి చేశారు. తన పేరును చాలాకాలంగా తప్పుగా ప్రచారం చేస్తున్నారని, ఇకపై తనను ‘అన్నా లెజినోవా’ అని కాకుండా ‘అన్నా కొణిదెల’ అని మాత్రమే పిలవాలని అభిమానులను, మీడియాను కోరారు. తన పుట్టినరోజు సమీపిస్తున్న వేళ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే తన పేరు ‘లెజినోవా’ అని నమోదైందని, పెళ్లయిన రోజే భర్త ఇంటిపేరును స్వీకరించి ‘అన్నా కొణిదెల’గా మారానని ఆమె స్పష్టం చేశారు. ఆ పేరులోనే తాను సంపూర్ణత్వాన్ని భావిస్తున్నట్లు ఎమోషనల్‌గా పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు పవన్ కల్యాణ్‌తో కలిసి వెళ్లిన తొలి పర్యటనలో దిగిన ఓ అరుదైన ఫొటోను కూడా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొద్ది గంటల్లోనే వేలాది లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. “ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెలగానే పిలుస్తాం వదినమ్మా” అంటూ జనసైనికులు, అభిమానులు ఆమెకు నెట్టింట పూర్తి మద్దతు తెలుపుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!

అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర!

భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం

Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు!

మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *