Headlines

అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర!

అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర!


భారత ప్రైవేట్ ఏరోస్పేస్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘మిషన్ ఆగమన్’ ద్వారా ప్రయోగించిన ‘విక్రమ్‌-1’ ఆర్బిటల్‌ రాకెట్‌లో.. ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాన్ని అంతరిక్షంలోకి పంపారు. సూరత్‌కు చెందిన ‘నిత్యాస్ జెమ్స్ అండ్ జువెలరీ’ సీఈఓ రజనీకాంత్ ఛాంద్‌చద్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ అరుదైన ప్రయోగం కోసం 20 మంది నిపుణులు దాదాపు 6 నెలల పాటు శ్రమించి తామరపువ్వు ఆకారంలో ప్రత్యేక డిజైన్ రూపొందించారు. మొత్తం 16.95 క్యారెట్లు కలిగిన 32 పియర్ కట్ ల్యాబ్ గ్రోన్ వజ్రాలతో దీనిని అమర్చారు. దీని విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుంది. రాకెట్ తీవ్రమైన కదలికలు, అంతరిక్షంలో ఉండే విపరీతమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియం ప్లేట్‌పై వీటిని భద్రపరిచారు. అంతరిక్షంలో సూర్యకిరణాలు పడినప్పుడల్లా ఈ వజ్రం అద్భుతమైన కాంతులతో మెరుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగంలో రత్నాల ప్రదర్శన జరగడం దేశంలోనే ఇదే తొలిసారి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భోగాపురంలో అదిరిపోయేలా ఏర్పాట్లు.. రేయింబవళ్లు కష్టపడుతున్న యంత్రాంగం

Elon Musk: ఎలాన్ మస్క్‌ మరో సూపర్‌ ప్లాన్‌.. X Moneyతో యాప్‌లోనే పూర్తి స్థాయి బ్యాంకింగ్ సేవలు!

మీకు స్మార్ట్ రేషన్ కార్డు కావాలా ?? ఈ ఒక్క పని చేయండి!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *