Headlines

ఇరాన్‌ శాంతి ప్రణాళికను తిప్పి పంపిన ట్రంప్‌ హర్మూజ్‌ కాదు.. ఇక ట్రంప్‌ జలసంధి అంటూ పోస్ట్‌


ప్రపంచాన్ని మరోసారి భయపెడుతున్న అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న భీకర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒక సంచలన శాంతి ప్రణాళికను అమెరికా ముందుంచింది. కేవలం ఏడు రోజుల్లోనే యుద్ధం ఆపేస్తామని, ప్రపంచాన్ని వణికిస్తున్న హార్ముజ్ జలసంధిని మళ్లీ తెరుస్తామని ప్రతిపాదించింది.అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రణాళికను సింప్లీగా తిరస్కరించారు. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ పై సంయుక్త దాడులు ప్రారంభించినప్పటి నుంచి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఖతర్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ ఈ కాంక్రీట్ ప్లాన్ ను అందించింది. నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం, చమురు ఆంక్షలను తొలగించడం, లెబనాన్ తో సహా అన్ని ప్రాంతాలలో కాల్పుల విరమణ పాటించడం ఇరాన్ ప్రధాన షరతులు.కానీ, గతంలో కుదిరిన ఒప్పందాలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ ఇరాన్ మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేరు. అంతేకాకుండా, ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో హార్ముజ్ జలసంధి ప్రాంతాన్ని “ట్రంప్ స్ట్రెయిట్” అని పేర్కొంటూ ఒక మ్యాప్ ను కూడా పంచుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

గేమ్ షురూ.. అనిరుధ్‌కు కరెక్ట్ పోటీ అతడేనా..?

నాని ప్యారడైజ్ మూవీపై కేటీఆర్ కామెంట్స్..శంకరన్న పాత్ర గురించి ఏం చెప్పారంటే?

ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఈ వారం రిలీజ్ అయ్యే సూపర్ మూవీస్ ఇవే

చిరంజీవి మామూలోడు కాదు.. అన్నీ గుర్తు పెట్టుకుంటున్నారు..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *