Headlines

ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్ లో దగ్గరుండి మరీ చూసేవారట

ఆ విలన్ చెప్పే డైలాగ్స్, యాక్షన్ అంటే బాలయ్యకు అంత ఇష్టమా.. సెట్ లో దగ్గరుండి మరీ చూసేవారట


నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్  మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఇటీవల బాలకృష్ణ నటించిన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాయి. ఇదిలా ఉంటే గతంలో బాలయ్య ఓ విలన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆ విలన్ ఎవరో కాదు దివంగత నటుడు జయప్రకాశ్ రెడ్డి. ఓ సినిమా ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ రెండు ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. బాలయ్య మాట్లాడుతూ..  సమరసింహారెడ్డి చిత్ర చిత్రీకరణ సమయంలో జరిగిన సంఘటనను వివరించారు బాలయ్య.  నాకు బాగా గుర్తు. సమరసింహారెడ్డి షూటింగ్ అప్పుడు నా క్లైమాక్స్ ఫైట్ అప్పుడు నా పోర్షన్ అయిపోయింది. ఇక ఆయన షాట్లు తీయాలి, నన్ను వెళ్లిపోమన్నారు గోపాల్ గారు. నేను ఎక్కడికి వెళ్తానండి.? నేను, మీ పని అయిపోయింది బాబు మీరు వెళ్లిపోండి అన్నారు.

ఇది కూడా చదివేయండి : అందంలో అమ్మను మించిపోయిన రోజా కూతురు.. కోరికల చిట్టా విప్పిన అన్షు మాలిక

క్లైమాక్స్ ఇప్పుడు మొదలవుతుందండి. నేను చేసిన ఫైటింగులు, డాన్స్ లు, లేకపోతే అది కాదు. ఇప్పుడు మొదలవుతుంది క్లైమాక్స్. నేను ఇక్కడే ఉంటా.. మొత్తం దగ్గరుండి ఆయన ఏం చేస్తున్నారో చూసి అప్పుడు ఆయన పని పూర్తయ్యాక నేను బయలుదేరాను అక్కడి నుంచి” అని బాలకృష్ణ తెలిపారు. ఆ సన్నివేశం ఎంత పండకపోతే ఆ చిత్రం ఆడదని, ఎన్ని డాన్సులు, ఫైట్లు, కేకలు వేసినా, నవ్వినా ప్రేక్షకులు తృప్తి పడరని అప్పుడే తాను గ్రహించినట్లు ఆయన తెలిపారు. ఇది జయప్రకాష్ రెడ్డి గారి నటన యొక్క శక్తికి, ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యతకు నిదర్శనం అని బాలయ్య అన్నారు.

ఇది కూడా చదివేయండి : RGV: ఇదేందయ్యా..! ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.? అది కూడా ఓ గుడిలో

అలాగే  రెండో సంఘటనగా, బ్రహ్మంగారి చరిత్ర చిత్ర చిత్రీకరణ సమయంలో తన తండ్రి, దివంగత ఎన్.టి.రామారావు గారు తనకు ఇచ్చిన సలహాను గుర్తుచేసుకున్నారు. “బ్రహ్మంగారి చరిత్ర షూటింగ్ అప్పుడు నాన్నగారు క్లైమాక్స్ సీను ఆ సమాధి మీద తల కొట్టుకోవడం ఉంటుంది ఈయన జీవ సమాధిలోకి వెళ్ళాక. నన్ను పిలిచారు. అప్పుడే స్కూల్ కి వెళ్తున్నాను. పెద్ద ఇంత కాన్సన్ట్రేషన్ లేదు నాకు. చదువు ఒక పక్క, నటన మరోపక్క. పిలిచి ఒరేయ్ ఈ సినిమా నువ్వు బాగా పండించాలిరా, ఈ సీను, సన్నివేశం నువ్వు పండిస్తేనే సినిమా హిట్ అన్నారు.” అప్పుడు చిన్నవాడిగా ఉన్న తనకు ఆ మాటల అంతరార్థం అర్థం కాలేదని బాలకృష్ణ పేర్కొన్నారు. తానెందుకు సినిమాను హిట్ చేయాలని, ఎన్.టి.రామారావు గారు ఉన్నప్పుడు తన పాత్ర అంత ముఖ్యమా అని ఆలోచించినట్లు తెలిపారు. అయితే, కాలక్రమేణా, ఒక సన్నివేశం, ఒక పాట, ఒక డైలాగ్ లేదా ఒక పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటాయో అర్థమైందని వివరించారు. సినిమా విజయం కేవలం ప్రధాన నటుడి డైలాగుల వల్ల కాదని, ప్రతి అంశం కలిసికట్టుగా కృషి చేసినప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని బాలకృష్ణ తెలిపారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదివేయండి : రోజుకు 3లక్షలు రెమ్యునరేషన్.. మంచంపై నోట్ల కట్టలు పరుచుకుని పడుకునేది.. చివరకు అనాధలా చనిపోయింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *