Headlines

ఆయన 12వేల పరుగులు చేసిన తోపేమో.. నా ముందు మాత్రం ఓ బచ్చా.. ఏకంగా 16 సార్లు షాకిచ్చా..


సౌతాఫ్రికా (South Africa) తరపున సుదీర్ఘకాలం పాటు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ (Dale Steyn) అంతర్జాతీయ క్రికెట్‌లో సుమారు ఏడు వందల వికెట్లను సాధించి అగ్రశ్రేణి బౌలర్‌గా నిలిచాడు. తన 15 ఏళ్ల ప్రయాణంలో ఎంతోమంది దిగ్గజ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఈ స్పీడ్ గన్, రిటైర్మెంట్ తరువాత ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మాజీ సహచర ఆటగాడు వెర్నాన్ ఫిలాండర్ (Vernon Philander) తో మాట్లాడిన సందర్భంగా, ప్రస్తుత వయసులో కూడా తాను మళ్లీ బౌలింగ్ చేయడానికి ఇష్టపడే ఒక్కే ఒక్క బ్యాటర్ ఎవరనే ప్రశ్నకు ఆయన పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez) పేరును బదులిచ్చాడు.

క్రికెట్ ప్రపంచంలో హఫీజ్ వర్సెస్ స్టెయిన్ పోరు ఒకానొక దశలో అత్యంత ఏకపక్షంగా సాగిందని చెప్పవచ్చు. డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో హఫీజ్ అనేకసార్లు ఇబ్బంది పడుతూ తక్కువ పరుగులకే వెనుదిరిగాడు. 2013లో జరిగిన సౌతాఫ్రికా పర్యటనలోనూ హఫీజ్ వికెట్ పడినప్పుడు స్టెయిన్ మైదానంలో నవ్వుతూ కనిపించిన దృశ్యాలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. స్టెయిన్ వేసిన ప్రమాదకరమైన డెలివరీలను ఎదుర్కోవడంలో హఫీజ్ తీవ్రంగా తంటాలు పడ్డారు. గణాంకాల ప్రకారం అన్ని ఫార్మాట్లలో కలిపి హఫీజ్‌ను స్టెయిన్ 15 సార్లు ఔట్ చేయడం గమనార్హం. ఇందులో ఒక్క టెస్టు క్రికెట్‌లోనే 8సార్లు ఆయనను బోల్తా కొట్టించాడు.

ఎక్కువమంది చదివినది: Team India: అందరికీ న్యాయం చేశారు.. కానీ, ఆ ఒక్కడినే ఎందుకు బలి చేశారు గంభీర్ జీ..!

ఇవి కూడా చదవండి



విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez) పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. 2007 ప్రారంభ టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన జట్టులో ఆయన కీలక సభ్యుడిగా ఉన్నాడు. అలాగే 2017లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాక్ జట్టులోనూ తన వంతు పాత్ర పోషించాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు అన్ని ఫార్మాట్లలో కలిపి ఆయన పన్నెండు వేలకు పైగా పరుగులు సాధించాడు. అలాగే తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో 250కి పైగా వికెట్లను పడగొట్టి అద్భుతమైన ఆల్ రౌండర్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *