Headlines

Women Bill: మహిళా బిల్లుపై ‘మహా’ ఉత్కంఠ.. మోదీ మ్యాజిక్ చేస్తారా? ఎన్డీఏ గట్టెక్కుతుందా?

Women Bill: మహిళా బిల్లుపై ‘మహా’ ఉత్కంఠ.. మోదీ మ్యాజిక్ చేస్తారా? ఎన్డీఏ గట్టెక్కుతుందా?


లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ రాజకీయ సమీకరణాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. మరి కొన్ని గంటల్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కిస్తుందా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బిల్లును వ్యతిరేకిస్తానని ప్రకటించడం రాజకీయ వేడిని పెంచింది.

ప్రస్తుతం లోక్‌సభలో ఉన్న 540 మంది ఎంపీల గణాంకాలను పరిశీలిస్తే, బిల్లు ఆమోదం పొందడం కత్తిమీద సాములా కనిపిస్తోంది. రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి, దీనికి మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ, అంటే కనీసం 360 మంది ఎంపీల మద్దతు అవసరం.

ప్రస్తుతం ఎన్డీఏ (NDA) బలం 293 మంది ఎంపీలు. పూర్తి స్థాయిగా లక్ష్యం చేరుకోవడానికి ఇంకా 67 మంది అవసరం. ఇండీ కూటమికి లోక్‌సభలో 232 మంది ఎంపీలు ఉన్నారు. ఇక ఇతరులు, స్వతంత్రులు 15 మంది ఎంపీలు ఉణ్నారు.. అయితే రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 98 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకోవడంతో, ప్రభుత్వానికి ఇప్పుడు బయటి పార్టీల మద్దతు అనివార్యమైంది.

ఎస్పీ కోర్టులో బంతి..!

ప్రస్తుత తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) కీలకంగా మారింది. లోక్‌సభలో ప్రతిపక్షాల్లో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న ఎస్పీ మద్దతు ఇస్తే తప్ప, ఈ బిల్లు నెగ్గడం కష్టం. ఈ క్రమంలోనే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో 15 నిమిషాల పాటు జరిపిన ఏకాంత చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవేళ సమాజ్‌వాదీ పార్టీ, మరికొన్ని చిన్న పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తే, మేజిక్ ఫిగర్ 360ని చేరుకోవడం మోదీ ప్రభుత్వానికి సులభతరం అవుతుంది. లేని పక్షంలో, మహిళా రిజర్వేషన్ బిల్లు మరోసారి పార్లమెంటులోనే ఆగిపోయే ప్రమాదం ఉంది.

ఎన్డీఏ పార్టీలలో ఎవరికి ఎంత మంది ఎంపీలు ఉన్నారు?

1. బీజేపీ – 240
2. టీడీపీ – 16
3. జేడీయూ – 12
4. శివసేన- 7
5. ఎల్‌జేపీ (ఆర్) – 5
6. జనసేన పార్టీ – 2
7. జనతా దళ్ (ఎస్) – 2
8. ఆర్‌ఎల్‌డీ – 2
9. ఏజీపీ – 1
10. ఎన్‌సీపీ – 1
11. ఎస్‌కేఎం – 1
12. ఏజేఎస్‌యూ – 1
13. అప్నా దళ్ (ఎస్) – 1
14. యూపీపీఎల్ – 1
15. ఓటీహెచ్ – 1

ప్రతిపక్ష పార్టీల సంఖ్య

1. కాంగ్రెస్ – 98
2. ఎస్పీ – 37
3. టీఎంసీ – 28
4. డీఎంకే – 22
5. శివసేన (యూబీటీ) – 9
6. ఎన్‌సీపీ (ఎస్పీ) – 8
7. సీపీఐ (ఎం) – 4
8. ఆర్‌జేడీ – 4
9. ఐయూఎంఎల్ – 3
10. ఆప్ – 3
11. జేఎంఎం – 3
12. సీపీఐ – 2
13. వీసీకే – 2
14. సీపీఐ (ఎంఎల్) – 2
15. ఎన్‌సీ – 2
16. కేరళ కాంగ్రెస్ – 1
17. ఎండీఎంకే – 1
18. ఏఐఎంఐఎం – 1
19. ఆర్‌ఎస్‌పీ – 1
20. ఏఎస్పీ – 1

ఇతరులుః

స్వతంత్ర : 7
వైఎస్ఆర్సిపి – 4
ఆర్ఎల్పీ – 1
బిఎపి – 1
ఎస్ఎడి – 1
జెడ్పిఎం – 1

రాహుల్ గాంధీ విమర్శలు, ప్రధాని మోదీ వ్యూహాల మధ్య ఈ “నంబర్ గేమ్” ఎటు తిరుగుతుందో చూడాలి. మహిళా సాధికారత దిశగా చారిత్రాత్మక అడుగు పడుతుందా? లేక రాజకీయ విభేదాల మధ్య బిల్లు వీగిపోతుందా? అన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *