Jabardasth Rajamouli: ఆ ఇద్దరే వల్లే నా కెరీర్ నాశనం.. జబర్దస్త్ టాప్ కమెడియన్ల గుట్టు రట్టు చేసిన రాజమౌళి

Jabardasth Rajamouli: ఆ ఇద్దరే వల్లే నా కెరీర్ నాశనం.. జబర్దస్త్ టాప్ కమెడియన్ల గుట్టు రట్టు చేసిన రాజమౌళి


కంటెంట్ పరంగా కొన్ని విమర్శలున్నా జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. గతంలోలా ఇప్పుడీ షోకు అంత క్రేజ్, ఆదరణ లేకపోయినా చాలా మంది ఈ షోతోనే తమ ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు. జబర్దస్త్ లో కంటెస్టెంట్లుగా, టీమ్ లీడర్స్ గా చేసిన వారిలో ఇప్పుడు చాలా మంది వెండితెరపై వెలుగుతున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా రాణిస్తున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజమౌళి కూడా ఒకరు. తాగు బోతు పాత్రలతో ఇతను చేసిన స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే సినిమా పాటలను పేరడీ చేస్తూ పాడే విధానం కూడా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అయితే జబర్దస్త్ లో మంచి కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన రాజమౌళి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. జబర్దస్త్ తో పాటు మరే టీవీ షోలనూ నటించడం లేదు. అయితే అప్పుడప్పుడు మాత్రం కొన్ని సినిమాల్లో మాత్రం కనిపిస్తున్నాడు. మరి తనకు ఎంతగానో గుర్తింపు తీసుకొచ్చిన జబర్దస్త్ కు రాజమౌళి దూరం కావడానికి కారణమేంటి? ఇదే విషయంపై కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు రాజమౌళి.

‘నాకు జబర్దస్త్ మంచి పేరు తెచ్చిపెట్టింది. నాగబాబు సార్ నా స్కిట్స్ , నేను పాడే పేరడీ సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేసేవారు. నా ప్రతిభను చూసే నాతో పాటు జీవన్ ని కలిపి ఒకసారి టీమ్ లీడర్స్ చేశారు మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఈ విషయం తెలిసి మేమెంతో హ్యాపీగా ఫీలయ్యాం. ఆనందంతో అందరికీ స్వీట్స్ కూడా పంచిపెట్టాం. అప్పటికి నేను కిర్రాక్ ఆర్పీ టీమ్, జీవన్ వెంకీ మంకీ టీమ్స్ లో కీ కంటెస్టెంట్స్ గా ఉన్నాం. అయితే మాకు టీమ్ లీడర్ ఇచ్చారని తెలిసి ఆర్పీ, వెంకీ జబర్దస్త్ డైరెక్టర్స్ దగ్గరకు వెళ్లారు. రాజమౌళి, జీవన్ లకు టీమ్ లీడర్స్ ఇస్తే మా టీమ్స్ వీక్ అయిపోతాయి. మాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ దొరికేదాకా వాళ్లకు టీమ్ లీడర్స్ ఇవ్వొద్దు అన్నారు. దాంతో మా టీమ్ లీడర్ పొజిషన్స్ హోల్డ్ లో పెట్టేశారు. మళ్లీ కంటెస్టెంట్స్ గానే చేశారు’

ఇవి కూడా చదవండి

‘నాకు  టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చినప్పుడు ఆర్పీ, వెంకీ పోగొట్టారని తెలిసి నా మనసుకు చాలా బాధేసింది. అయితే జబర్దస్త్ షో నుంచి నాగబాబు గారు వెళ్లియాక మళ్లీ టీమ్ లీడర్స్ ఛాన్స్ ఇచ్చారు. కానీ అపుడు నా ఆరోగ్యం సరిగా లేదు. దీంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాను. పంచ్ ప్రసాద్ కి కూడా టీమ్ లీడర్ అయ్యాక తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. స్ట్రెస్ తీసుకోలేకపోయాడు. అది చూసి ఇంక నేను కూడా టీమ్ లీడర్ అవ్వకూడదు అనుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

జబర్దస్త్ యాక్టర్స్ తో రాజమౌళి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *