వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): గురు, శుక్రుల బలంతో పాటు శని బలం కూడా పెరిగినందువల్ల ఆర్థికపరంగా వారమంతా బాగానే సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇతరులకు సహా యం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నప్పటికీ ముందుకు దూసుకుపోతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.