Headlines

Weather Report: బలహీనపడుతున్న అక్వాన్ తుఫాన్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?


పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో, ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఉన్న అక్వాన్ (Akvan) తుఫాను, గడచిన 6 గంటలలో గంటకు 26 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయవ్య దిశగా పయనించింది. ఈరోజు ఈ తుపాను గోపాల్‌పూర్ సమీపంలో, దక్షిణ ఒడిశా తీర ప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంపై కేంద్రీకృతమై ఉంది. ఇది కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కు ఈశాన్యంగా సుమారు 120 కి.మీ దూరంలో, పూరీ (ఒడిశా)కి పశ్చిమ-నైరుతి దిశలో 130 కి.మీ దూరంలో, విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కు ఈశాన్యంగా 230 కి.మీ దూరంలో ఉంది. తుపాను సమయంలో గాలి వేగం గంటకు 70-80 కి.మీగా, గరిష్టంగా 90 కి.మీ వేగంతో వీచింది. ఇది రాబోయే 3 గంటల్లో ఉత్తర-ఈశాన్య దిశగా పయనిస్తూ తీవ్ర వాయుగుండముగా ఆ తర్వాతి 6 గంటల్లో వాయుగుండముగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది..

ఈ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో వర్షాలు

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం: ఈ తుఫాన్ ప్రభావంతో శుక్ర, శనివారం కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని.. అలాగే వర్షాల సమయంలో గంటకు 30-40 కి. మీ వేగంతో ఈదురుగాలు వీచే ఛాన్స్ ఉందని వాతావరణం శాఖ తెలిపింది. ఆక ఆదివారం ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని స్పష్టం చేసింది.

రాయలసీమ: ఈ తుఫాన్ ప్రభావంతో శుక్ర, శనివారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడుతాయని, కొన్ని చోట్ల బలమైన గాలులు గంటకు 30-40 కి. మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతవరణ శాఖ స్పస్టం చేసింది. ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఊరుములతో కూడిన జల్లులు కురుస్తాయని ప్రకటించింది.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇక ఈ తుఫాన్ ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర సూచించింది. వాతవారణ శాఖ ప్రకారం శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. శని, ఆదివారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

అలాగే శుక్రవారం రాష్ట్రంలోని ఒకటి రెండు ఉత్తర, తూర్పు జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *