Headlines

Samantha : సమంత కొడుకు పేరుకు అర్థమేంటో తెలుసా.. ?


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం మధ్యాహ్నం తన ఇన్ స్టా వేదికగా ప్రకటించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన కుమారుడు చేతి వేళ్లు.. తన చేతి వేళ్లను చూపిస్తూ అందమైన ఫోటోను పంచుకుంది. అలాగే ఈ ఆనందకరమైన వార్తతో పాటు, తమ ముద్దుల కుమారుడికి ‘దేవ్’ అని పేరు పెట్టినట్లు సమంత వెల్లడించారు. చిన్నారి పేరు ప్రకటించినప్పటి నుంచే, ‘దేవ్’ అనే పేరుకు ఉన్న ప్రత్యేకత, దాని వెనుక ఉన్న అర్థం ఏంటో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. సంస్కృత మూలాల నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన, పవిత్రమైన పేర్లలో ‘దేవ్’ ఒకటి. భారతీయ సంస్కృతిలో ఈ పేరుకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

దేవ్ పేరుకు అర్థాలు..

దైవత్వం & కాంతి: సంస్కృతంలో ‘దేవ్’ అంటే ‘దేవుడు’ లేదా ‘దైవికమైనది’ అని అర్థం. అలాగే ‘ప్రకాశించేవాడు’ లేదా ‘కాంతివంతుడు’ అనే అర్థాలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం దివ్యమైన శక్తి, స్వచ్ఛత, ఉన్నతమైన లక్షణాలకు ప్రతీకగా ఈ పేరును ఉపయోగిస్తారు.

ఆధునికత & సంప్రదాయం కలయిక: కేవలం రెండు అక్షరాలతో పలకడానికి ఎంతో సులభంగా, ఆధునికంగా ఉంటూనే, లోతైన సంప్రదాయ అర్థాన్ని కలిగి ఉండటం ఈ పేరు ప్రత్యేకత.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

సమంత తన కుమారుడికి ‘దేవ్’ అని పేరు పెట్టినట్లు ప్రకటించగానే, ఈ పేరు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. చిన్నారి పేరు ఎంతో పవర్‌ఫుల్‌గా ఉందని, భవిష్యత్తులో తల్లిలాగే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. తెలుగు, తమిళం సహా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు కావడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సమంత జీవితంలో ఇప్పుడు ఈ కొత్త అధ్యాయం మొదలవడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘దేవ్’ రాకతో సమంత ఇంట ఆనందం వెల్లివిరిసిందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

సమంత పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *