జబర్దస్త్ ఫేమ్ డేగల బాబు పేరు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇటీవలే ఆయన డైరెక్ట్ చేసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే, మొదటి రోజు నుంచి ట్రెండింగ్ లోనే ఉంది.
డైరెక్టర్ సక్సెస్ అయినా బాబు రియల్ లైఫ్ లో ఓ ఇంటి వాడయ్యాడు.
తనను తాను దర్శకుడిగా చూసుకున్న తరవాతే పెళ్లి చేసుకుంటాన ని చెప్పిన బాబు.. తను ప్రేమించిన అమూల్యతో ఏడడుగులు వేశారు. కొద్దీ రోజుల ముందు.. మరో వారంలో నా పెళ్లి అని చెప్పిన అందరికి గుడ్ న్యూస్ చెప్పారు. ఇక ఆయన చెప్పినట్టు గానే అమూల్య మెడలో మూడు ముళ్ళు వేసి ఇద్దరూ ఒక్కటయ్యారు.
పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ,వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని అభిమానులతో పంచుకుంటూ హల్దీ వీడియోలు కూడా షేర్ చేశారు. దర్శకుడిగా హిట్ కొట్టిన డేగల బాబు ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. ఈ పెళ్లి వేడుక సన్నిహితులుఎం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
అంతేకాదు, ఈ పెళ్లి వేడుకలో జబర్దస్త్ టీం సందడీ చేసారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో సినీ సెలబ్రిటీలు, బుల్లితెర అభిమానులు విషెస్ చెబుతున్నారు. అమూల్య విషయానికి వస్తే .. పలు తెలుగు న్యూస్ చానల్స్ లో యాంకర్ గా పనిచేసింది. అందరి లవ్ స్టోరీ లు కన్నా బాబు స్టోరీ మాత్రం భిన్నంగా ఉంటుంది.
అమూల్య యాంకర్ గా పనిచేస్తున్న సమయంలోనే బాబు ఆమెను చూసి ఇష్టపడి, ఆమెకు తన ప్రేమ విషయాన్ని చెప్పి చివరకుతను కాదన్నా ఆమె కోసం వెయిట్ చేసి ప్రేమను గెలిపించుకుని ఈ రోజున అమూల్య లవ్స్ బాబు గా అందరి చేత పిలిచుపించుకుని అంగరంగ వైభవంగా గ్రాండుగా పెళ్ళి చేసుకున్నాడు.




