Headlines

Watch Video: చెరుకు తోటలో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. దగ్గరకెళ్లి చూడగా..

Watch Video: చెరుకు తోటలో ఎయిర్‌క్రాఫ్ట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. దగ్గరకెళ్లి చూడగా..


ఓ ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవసాయ పొలంలో ల్యాండ్ అయిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బారామతి సమీపంలోని గోజుబావి గ్రామంలో ఉన్న వ్యవసాయ పోలంలో రెడ్ బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీకు చెందిన ఓ ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. అయితే ఎయిర్‌క్రాఫ్ట్‌ సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్ దాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే రెడ్‌బర్డ్ సెంటర్ నుంచి ఉదయం సుమారు 8:40 గంటల శిక్షణకు బయల్దేరిన ఈ విమానంలో మార్గమధ్యలోనే సాంకేతిక సమస్య తలెత్తింది. గాలిలో ఉన్నప్పుడే ఇంజిన్ శక్తిని కోల్పోంది.

ఈ సమస్యను గుర్తించిన పైలెట్ వెంటనే అలర్ట్ అయ్యాడు. గ్రామానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలోని ఒక చెరకు తోటలో పైలట్ విమానాన్ని ఎంతో చాకచక్యంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో ఉన్న పైలెట్‌తో పాటు స్థానికంగా ఉన్న ప్రజలకు కూడా ఎలాంటి హాని జరగలేదు.

వీడియో చూడండి..

అయితే విమానం పొలంలో దిగగానే స్థానిక ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, పరిపాలనా అధికారులు ఘటన స్థలానికి చేరుకుని, సాంకేతిక వైఫల్యానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. బారామతిలోని గోజుబావి గ్రామంలో ఇంతకు ముందు కూడా విమాన ప్రమాదాలు వెలుగు చూశాయి. గతంలో మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానం కూలిపోయిన ప్రాంతం కూడా ఇదే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *