Watch: గాడ నిద్రలో ఉండగా ఒక్కసారిగా కుదుపు.. లేచి చూసేలోపు ఇది పరిస్థితి.. ఏం జరిగిందంటే?

Watch: గాడ నిద్రలో ఉండగా ఒక్కసారిగా కుదుపు.. లేచి చూసేలోపు ఇది పరిస్థితి.. ఏం జరిగిందంటే?


రోజురోజుకూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదాలు పెరిగిపోతున్నారు. ఇటీవలే కర్నూలలో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే తాజాగా అనకాపల్లి జిల్లాలో మరో ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. నక్కపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తున్న బస్సు నక్కపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయానికులు నిద్రవస్తలో ఉండగా ఈ ఘటన జరగడంతో ఏం జరిగిందో తెలియక బస్సులో ప్రయాణిస్తున్న వారంతా హడలెత్తిపోయారు. తేరుకునేసరికి బస్సు బోల్తా పడి ఉన్నట్టు గుర్తించి గుండెలు పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్ నుంచి 38 మంది ప్రయాణికులతో బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. నక్కపల్లి పరిసర ప్రాంతాల్లోకి రాగానే ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రహదారి పక్కనే ఉన్న పంట కాల్వ గుంతలోకి బస్సు దూసుకుపోయి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికుల్లో 10 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బస్సు అద్దాలు పగులగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు.

ఇక సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రాతులను నక్కపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదం కారణంగా ఏర్పడిన భారీ ట్రాఫిక్‌ జామ్‌ను పోలీసులు క్లియర్ చేశారు. క్రేన్ సహాయంతో బోల్తా పడిన బస్సును పక్కకు తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బస్సు సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *