బిగ్ ఫైట్ డ్రాగన్‌ Vs కబీర్ సింగ్

బిగ్ ఫైట్ డ్రాగన్‌ Vs కబీర్ సింగ్


ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ మూవీ నుంచి ఉన్నట్టుండి ఓ అప్టేట్ బయటికి వచ్చింది. ఈ మూవీలో.. బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఢీకొట్టబోతున్నారనే న్యూస్ ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ షూటింగ్‌ను పరిగెత్తిస్తున్నాడు. శక్తి వంచన లేకుండా ప్రశాంత్‌ నీల్ క్రియేట్ చేసిన హీరోగా కనిపించేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీలో యంగ్ టైగర్‌ను ఢీకొనబో్యే పాత్రలో టొవినో థామస్‌ను ఎంచుకున్నాడు ప్రశాంత్ నీల్. కానీ డేట్స్ కుదరకపోవడంతో.. టొవినో డ్రాగన్ నుంచి తప్పుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన నేరుగా మీడియాతో చెప్పేశాడు. అయితే ఇప్పుడు టొవినో థామస్ స్థానంలో షాహిద్ కపూర్‌ను విలన్ పాత్ర కోసం ఎంచుకున్నాడట డ్రాగన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇందుకు తారక్‌ కూడా ఓకే చెప్పడంతో… షాహిద్ తో మాట్లాడుతున్నాడట. అయితే షాహిద్ ఓకే చెప్పాడనే టాక్ బీటౌన్‌లో వినిపిస్తున్నా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు డ్రాగర్ విలన్ ఎవరో చెప్పలేని పరిస్థితి. షాహిద్ కపూర్ మాత్రమే కాదు.. ఈ సినిమాలో మరో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా భాగమైనట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అనిల్ కపూర్ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్టు ఆయన నోటి నుంచే ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మేషన్ వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anna Rajan: సబ్‌స్క్రిప్షన్‌ అంటే బూతు కంటెంట్ కాదు.. నాదగ్గర కథలొద్దు

ఇక రైళ్లలో ‘డగ డగ’ శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !

చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??

ఉదయాన్నే ప్లెయిన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్‌ విషయం విన్నారా ??

Rashmika Mandanna: వైరల్ అవుతున్న రష్మిక మేకప్ టాపిక్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *