Headlines

Viral Video: ఒడిశా అడవుల్లో అరుదైన ఒరాంగుటాన్‌లు.. మన దేశంలో ఉనికేలేని ఈ జీవులు.. ఎలా వచ్చాయ్!


విదేశాల్లో ఎక్కవగా కనిపించే అరుదైన జాతికి చెందిన ఒరాంగుటాన్‌లో ఒడిశాలో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాలేశ్వర్‌ జిల్లా బిచిత్రపూర్‌ అటవీ ప్రాంతంలో ఐదు ఒరాంగుటాన్‌లను గుర్తించిన స్థానికువు అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే ఈ విషయం ఆనోలా ఈ నోటా పాకి స్థానిక ప్రజలకు తెలియడంతో కొద్ది సేపట్లోనే వేలాది మంది స్థానికులు వాటిని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఇక సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని అదుపులోకి తీసుకొని జూకు తరలించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచిత్రపూర్‌ అటవీ ప్రాంతంలో ఒరాంగుటాన్స్‌ ఉన్నాయన్న సమాచారంతో అక్కడికి వెళ్లగా.. సుమారు అక్కడ ఐదు ఒరాంగుటాన్ పిల్లలు కనిపించినట్టు అధికారులు తెలిపారు. మన దేశంలో వీటిని మనుగడ లేదని.. ఇవి ఎక్కవగా ఆగ్నేషియా, ఇండినేషియా, మలేషియాలోని అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయని తెలిపారు. ఇప్పుడు దొరికిన ఈ ఐదింటిలో నాలుగు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని.. ఆహారం తింటూ ఓఆర్ఎస్ తాగుతున్నాయని తెలిపారు. పశువైద్యులు వాటిని పరీక్షించి చికిత్స అందిస్తున్నారన్నారు.

అయితే అంతర్జాతీయ వన్యప్రాణి స్మగ్లర్లు అక్రమంగా తరలించే క్రమంలో వీటిని ఇక్కడ వదిలివెళ్లుంటారని ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే బ్లాక్‌ మార్కెట్‌లో వీటి ధర లక్షల్లో ఉంటుందని.. ఒక్కో ఒరాంగుటాన్‌ విలువ రూ.20 నుంచి 25 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు.

వీడియో చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *