Headlines

Vijaya shanti : నన్ను శాంతమ్మ అని ఆప్యాయంగా పిలిచేవారు.. ఆయనతో 6 సినిమాలు చేశాను.. విజయ శాంతి కామెంట్స్..


సౌత్ ఇండస్ట్రీలో సహజ నటనతోపాటు వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేసిన హీరోయిన్ విజయశాంతి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి, ‘లేడీ అమితాబ్’ విజయశాంతి తన సినీ ప్రయాణంలోని కీలక ఘట్టాలను, లెజెండరీ దర్శకుడు టి. కృష్ణ గారితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. సినీ పరిశ్రమలో ఒక నటిగా హీరోలతో సమానమైన గుర్తింపు, ఇమేజ్ సాధించడం ఎంతో కష్టమైన విషయమని విజయశాంతి పేర్కొన్నారు. ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, రఫ్ అండ్ టఫ్ బాడీ లాంగ్వేజ్‌తో యాక్షన్ సీన్లు చేయడం తనకు పెద్ద సవాలుగా మారింది. అప్పట్లో గ్రాఫిక్స్ లేదా డూప్‌ల సాయం లేకుండానే 20 నుండి 30 అడుగుల ఎత్తు నుండి దూకడం వంటి ప్రాణాంతకమైన సాహసాలు చేసి రియలిస్టిక్ లుక్ తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Actor: ఒకప్పుడు కెమిస్ట్‌గా, వాచ్‌మన్‌గా పనిచేసి.. ఇప్పుడు తోపు నటుడు.. 200 కోట్లకు అధిపతి..

తన నటనలోని అసలు ప్రతిభను బయటకు తీసిన ఘనత దర్శకుడు టి. కృష్ణ గారికే దక్కుతుందని విజయశాంతి ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. ‘నేటి భారతం’ సినిమాతో తనలోని సీరియస్ నటిని గుర్తించిన ఆయన, ఆమెను ఎంతో ప్రేమిస్తూ ఆప్యాయంగా శాంతమ్మ అని పిలిచేవారని అన్నారు. ఆయన దర్శకత్వంలో వరుసగా ఆరు సినిమాలు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా, టాలీవుడ్ చరిత్రలో విప్లవాత్మక చిత్రంగా నిలిచిన ‘ప్రతిఘటన’లో నటించే అవకాశం తనకు దక్కడం పెద్ద మలుపు అని అన్నారు. ఆ సమయంలో ఆమె చాలా చిన్న వయస్కురాలు కావడంతో లెక్చరర్ పాత్రకు సరిపోదని పరిశ్రమలో పలువురు విమర్శించారు టి. కృష్ణ గారు విజయశాంతిపై పూర్తి నమ్మకంతో ఆ పాత్రను ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ సవాలును స్వీకరించి అద్భుతంగా నటించానని విజయశాంతి చెప్పారు.

ఎక్కువమంది చదివినవి : Arjun Sarja : ఆ హీరోయిన్‏ను చాలా మిస్సవుతున్నా.. ఆమె దూరమయ్యాకే అర్థం చేసుకున్న.. అర్జున్ సర్జా..

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె మహేష్ బాబు, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రంలో నటించారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *