Headlines

Video: చివరి ఓవర్‌లో 22 పరుగులు.. క్రీజులో టీమిండియా బ్యాడ్‌లక్కోడు.. కట్‌చేస్తే.. రిజల్ట్ మీ ఊహకందదంతే..!

Video: చివరి ఓవర్‌లో 22 పరుగులు.. క్రీజులో టీమిండియా బ్యాడ్‌లక్కోడు.. కట్‌చేస్తే.. రిజల్ట్ మీ ఊహకందదంతే..!


LPL 2026, Vijay Shankar vs Dilshan Madushanka: లంక ప్రీమియర్ లీగ్ 2026లో క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మరచిపోలేని ఒక మైండ్ బ్లాకింగ్ డ్రామా చోటుచేసుకుంది. విజయానికి ఆఖరి 6 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన వేళ, భారత ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ క్రీజులో ఉన్నాడు. శ్రీలంక పేసర్ దిల్షాన్ మదుశంక విసిరిన ధాటికి సింగిల్ రన్ కూడా రాకపోవడమే కాకుండా చివరికి వికెట్ పడటం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

పల్లెకెలె వేదికగా నరాలు తెగే ఉత్కంఠ..

పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జఫ్నా కింగ్స్, క్యాండీ రాయల్స్ జట్ల మధ్య 18వ లీగ్ మ్యాచ్ జరిగింది. హై-స్కోరింగ్ త్రిల్లర్‌గా సాగిన ఈ పోరులో జఫ్నా కింగ్స్ 21 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన జఫ్నా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 221 పరుగుల భారీ స్కోరు సాధించింది. సమాధానంగా బరిలోకి దిగిన క్యాండీ రాయల్స్ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 200 పరుగులకు ఆలౌట్ అయి ఓటమిపాలైంది.

ఇది కూడా చదవండి: WTC ఫైనల్ రేస్ నుంచి పాక్‌తోపాటు టీమిండియా ఔట్.. ఇలా జరిగితేనే గిల్ సేనకు ఛాన్స్..?

ఇవి కూడా చదవండి



జఫ్నా బ్యాటర్ల ధనాధన్ బ్యాటింగ్..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జఫ్నా కింగ్స్‌కు ఓపెనర్లు కమిల్ మిషారా, అవిష్క ఫెర్నాండో ఊహించని ఆరంభాన్ని ఇచ్చారు. మిషారా కేవలం 26 బంతుల్లో 5 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. ఫెర్నాండో 22 బంతుల్లో 36 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చమిందు విక్రమసింఘే మరింత ఉగ్రరూపం దాల్చాడు. అతను కేవలం 15 బంతుల్లో 4 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 43 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. షకీబ్ అల్ హసన్, తౌహీద్ హృదోయ్ కూడా ఉపయోగకరమైన పరుగులు జోడించడంతో జఫ్నా కింగ్స్ బహు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. క్యాండీ రాయల్స్ బౌలర్లలో మొయిన్ అలీ, వనిందు హసరంగ చెరో రెండు వికెట్లు తీశారు.

క్యాండీ రాయల్స్ పోరాటం.. విజయ్ శంకర్ ఆశలు

222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాండీ రాయల్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. పవన్ సందేశ్ 21 బంతుల్లో 48 పరుగులు, లహిరు ఇగలగామగే 15 బంతుల్లో 30 పరుగులు చేసి మ్యాచ్‌ను వేడిగా ఉంచారు. ఆ తర్వాత వనిందు హసరంగ, షాహీన్ షా అఫ్రిది చెరో 24 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం.. కళ్లు ఎక్కడ పెట్టుకున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్..

జఫ్నా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ వస్తున్నా, విజయ్ శంకర్ క్రీజులో ఉండటంతో మ్యాచ్ క్యాండీ రాయల్స్ వైపే మొగ్గు చూపింది. 15 బంతుల్లో 25 పరుగులు చేసి ఊపుమీదున్న విజయ్ శంకర్ క్రీజులో ఉండటంతో ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు సాధ్యమే అని అందరూ భావించారు.

మదుశంక మెరుపు ఓవర్.. మైండ్ బ్లాకింగ్ ముగింపు

ఆఖరి 20వ ఓవర్ వేసేందుకు దిల్షాన్ మదుశంక బంతిని అందుకున్నాడు. మొదటి బంతి నుంచే నిశితమైన యార్కర్లతో విజయ్ శంకర్‌ను లంక పేసర్ పూర్తిగా కట్టడి చేశాడు. వరుసగా 5 బంతులు డాట్ బాల్స్ కావడంతో విజయ్ శంకర్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరిగిపోయింది. ఓవర్ ఆఖరి బంతికి పరుగు తీసే ప్రయత్నంలో విజయ్ శంకర్ వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో మదుశంక ఆఖరి ఓవర్‌ను వికెట్ మేడెన్‌గా మార్చి జఫ్నా కింగ్స్‌కు అపూర్వ విజయాన్ని కట్టబెట్టాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *