మునగాకు తెలియని వారు ఎవరు ఉండరు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా కాపాడుతాయి. అయితే ఇది ఆరోగ్యానికే కాకుండా అందాన్ని పెంచడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుందంట. మునగాకుతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని ఉపయోగించడం వలన మొటిమలు, మచ్చలు తొలిగిపోయి, ముఖం తెల్లగా మిల మిల మెరుస్తుందని చెబుతున్నారు నిపుణులు.
చర్మ నిపుణులు డాక్టర్ సాహిల్ మన్సూరి ప్రకారం, మునగాకు చర్మ అందానికి చాలా మంచిదంట. చాలా మంది ఎక్కువగా పాలు, శనగపిండి, పెరుగు వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. కానీ ముగనగాకు పొడి కూడా అందాన్ని పెంచడంలో, చర్మానికి ఒక వరంలాంటిది అని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా మునగ పొడిని ఫేస్‌ప్యాక్‌లా ఉపయోగిచడం వలన ఇందులో ఉండే విటమిన్స్, మీ చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయంట.
అయితే దీనిని ఎలా చేయాలి అంటే? ముందుగా రెండు లేదా మూడు టీ స్పూన్ల మునగాకు పొడి తీసుకోవాలి. అలాగే కొన్ని చుక్కల గ్లిజరిన్ తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నీరు తీసుకోవాలి. ఇవన్నీ ఉపయోగించి, ముఖానికి అప్లై చేయడం వలన ఇది ముఖాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది.
దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో కొంచెం మునగాకు పొడి తీసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొన్ని చుక్కల గ్లిజరిన్ వేయండి. ఇది వేసిన తర్వాత పొడి మొత్తం కలిసేలా మంచిగా కలపాలి. అప్పుడే బాగుంటుంది. ఇది మొత్తం కలిసిన తర్వాత అందులో కొబ్బరి నీరు వేయాలి.
కొబ్బరి నీరు పోసి, అది మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇది పేస్ట్‌లా రెడీ అయిన తర్వాత దీనిని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. దీని తర్వాత సుమారు, 20 నిమిషాల వరకు ముఖానికి అలాగే ఉండనివ్వాలి. ఆతర్వాత ముఖం పూర్తిగా ఆరిపోయాక, దీనిని చల్లటి నీటితో శుభ్రంగా ముఖాన్ని కడగాలి. అంతే వారం రోజులు ఇలా చేయడం వలన ముఖం నిగారింపుగా తయారు అవుతుందంట.




