Headlines

Video: కళ్లను ఆశ్చర్యపరిచే కళాకండం.. కందిపప్పుపై బొజ్జ గణపయ్యను చెక్కిన ఆదోని కుర్రాడు


వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓ విద్యార్థి కందిపప్పు గింజపై సూక్ష్మ వినాయకుడి చిత్రాన్ని గీసి అబ్బురపరిచాడు. ఆదోని పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్‌కు చెందిన సుజాత, రాజు దంపతుల కుమారుడు పి. హరీష్ కుమార్ సూక్ష్మ కళలలో భాగంగా కందిపప్పుపై అతి చిన్న వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దాడు. హరీష్ కుమార్ ప్రస్తుతం నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతి చిన్న కందిపప్పుపై వినాయకుడి చిత్రాన్ని వేసిన విద్యార్థి ప్రతిభను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా విద్యార్థి పి. హరీష్ మాట్లాడుతూ.. ఈ సూక్ష్మ కళను పూర్తి చేయడానికి దాదాపు 15 సార్లు ప్రయత్నించానని తెలిపాడు. తమ డ్రాయింగ్ ఉపాధ్యాయుడు ఎన్. కీర ఇచ్చిన ప్రత్యేక శిక్షణతోనే ఈ సూక్ష్మ కళా వినాయకుడిని తయారు చేయగలిగానని పేర్కొన్నాడు. విద్యార్థులకు చిత్రకళతో పాటు వివిధ రకాల సూక్ష్మ కళలలు కూడా నేర్పిస్తున్నామని.. విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ట్, క్రాఫ్ట్‌కు సంబంధించిన పరికరాలను ఉపాధ్యాయులకు ఉచితంగా అందించి కళా విద్యను ప్రోత్సహించాలని డ్రాయింగ్ ఉపాధ్యాయుడు కోరారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *