తల్లిదండ్రులు కాబోతున్న ఒక దంపతులకు రొటీన్ స్కాన్ సమయం జీవితాంతం గుర్తుండిపోయే అద్భుతమైన జ్ఞాపకాన్ని అందించింది. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి స్కానింగ్ సెంటర్‌కు వెళ్లిన ఆ జంటకు, ఇంకా పుట్టని తమ పాప ఇచ్చిన సర్ప్రైజ్ చూసి డాక్టర్లు, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. తండ్రి గొంతు వినగానే ఆ చిన్నారి తల్లి కడుపులోనే చిరునవ్వులు చిందించిన అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో మిలియన్ల హృదయాలను గెలుచుకుంటుంది. కెనడాకు చెందిన లియా ఒలివేరా అనే మహిళ తన గర్భధారణ సమయంలో సాధారణ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం ఆసుపత్రికి వెళ్లింది. స్కానింగ్ జరుగుతుండగా, ఆమె భర్త భార్య కడుపుపై ముద్దుపెట్టుకుని.. ‘‘గుడ్ మార్నింగ్ స్వీటీ.. హ్యాపీ శనివారం’’ నీకు ఆకలిగా ఉందా?” అని చాలా ఆప్యాయంగా పలకరించాడు.
తండ్రి గొంతు వినగానే ఊహించని మ్యాజిక్..
తండ్రి మాట్లాడిన కొద్ది క్షణాల్లోనే అల్ట్రాసౌండ్ మానిటర్‌పై ఆ చిన్నారి ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షమైంది. కడుపులో ఉన్న పాప తండ్రి పిలుపుకు స్పందిస్తూ అలా నవ్వడం చూసి స్కానింగ్ రూమ్‌లో ఉన్న మెడికల్ స్టాఫ్, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ క్షణాన్ని భార్య సోదరి తన కెమెరాలో బంధించింది. తండ్రి ప్రేమగా మాట్లాడటం, దానికి ఆ బిడ్డ ప్రతిస్పందిస్తూ నవ్వడం చూసిన తల్లి లియా ఒలివేరా ఆనందబాష్పాలు ఆపుకోలేకపోయింది. ‘‘ఆ దృశ్యం చూసిన వెంటనే నాకంటి నుండి ఆనందకన్నీళ్లు ఆగలేదు. నా జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకం. ఈ అద్భుతమైన క్షణం ఇంటర్నెట్లో మిలియన్ల మందికి నవ్వులు పంచడం నాకు మరింత సంతోషాన్ని ఇస్తోంది’’ అని లియా భావోద్వేగంతో వెల్లడించింది.
సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా..
గర్భంలో ఉన్న బిడ్డలు కూడా తల్లిదండ్రుల స్పర్శను, గొంతును గుర్తుపడతారని సైన్స్ చెబుతున్నప్పటికీ.. ఇలా ప్రాక్టికల్‌గా మానిటర్‌పై పాప నవ్వడం చూడటం నిజంగా అరుదైన సంఘటన అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియో చూడండి..
A touching moment melted hearts as an unborn baby girl appeared to smile during an ultrasound when she heard her father’s voice.
The emotional clip has gone viral, celebrating the beautiful bond between a father and his daughter even before birth. 🥹 pic.twitter.com/Ps0fDKDezv
— AdyaKali ( HINDU ) (@satishshar1) July 31, 2026