Venu Madhav: చెడు అలవాట్లు కానే కాదు.. ఆ ఒక్క చిన్న తప్పే వేణు మాధవ్‌ను బలి తీసుకుంది.. పాపం చిన్న వయసులోనే..

Venu Madhav: చెడు అలవాట్లు కానే కాదు.. ఆ ఒక్క చిన్న తప్పే వేణు మాధవ్‌ను బలి తీసుకుంది.. పాపం చిన్న వయసులోనే..


మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన వేణు మాధవ్ తన ట్యాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగారు. సుమారు 500కు పైగా సినిమాల్లో నటుడిగా, హాస్య నటుడిగా మెప్పించారు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నారు. 1992 లో బాబాయ్ హోటల్ తో మొదలైన ఆయన సినీ ప్రస్థానం సంప్రదాయం, చిలక్కొట్టుడు, గోకులంలో సీత, పెళ్లి చేసుకుందాం, మాస్టర్, పవిత్ర ప్రేమ, శ్రీరాములయ్య, తొలి ప్రేమ, సూర్య వంశం, స్నేహితుడు, తమ్ముడు, యువరాజు, ప్రియమైన నీకు, ఆది, వాసు, నువ్వే నువ్వే, దిల్, సింహాద్రి, వెంకీ, ఆర్య, వర్షం, సై, శంకర్ దాదా ఎంబీబీఎస్, జై చిరంజీవి, లక్ష్మి, దేవదాసు, పోకిరి, దేశ ముదురు, కృష్ణ, చింతకాయల రవి, కిక్, నాయక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర సూపర్ హిట్ సినిమాల్లో నటించారు వేణు మాధవ్. చివరిగా 2016లో డా. పరమానందయ్య స్టూడెంట్ అనే సినిమాలో కనిపంచారాయన. కమెడియన్ గా బిజీగా ఉన్న సమయంలోనే వేణు మాధవ్ ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. 2019 సెప్టెంబర్ 25న ఆయన కన్నుమూశారు. అయితే వేణు మాధవ్ మరణంపై అప్పట్లో చాలా రూమర్లు వచ్చాయి. తాగుడు, స్మోకింగ్ లాంటి వ్యసనాలే వేణు మాధవ్ మృతికి కారణమని ప్రచారం జరిగింది. అయితే వేణు మాధవ్ మరణానికి ఇవేవీ కారణం కావని ఆయన భార్య, పిల్లలు, తల్లి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఒక చిన్న తప్పు కారణంగా వేణు మాధవ్ చనిపోయారని వారు చెప్పుకొచ్చారు.

‘ మా ఆయన చనిపోకముందే మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికితోడు ఆయనపై నెగెటివ్ ప్రచారం కూడా బాగా జరిగింది. నిజానికి మా వారు డెంగ్యూ ఫీవర్ రావడం వల్లే మరణించారు. సరైన కేర్ తీసుకోకపోవడం ఆయన ప్రాణం మీదకు తీసుకొచ్చింది. దీనికి తోడు వేణు మాధవ్ చనిపోవడానికి మూడు నెలల ముందు ఆయన సోదరుడు చనిపోయాడు. దీంతో ఆయన మరింత డిప్రెషన్ కు గురయ్యాడు’ అని వేణు మాధవ్ భార్య శ్రీవాణి ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

ఇక వేణు మాధవ్ తల్లి సావిత్రమ్మ మాట్లాడుతూ.. ‘ నా బిడ్డ చనిపోవడానికి కారణం అనారోగ్యానికి గురి అవడంతో పాటు మందులు వేసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండడమే. ఆ చిన్న తప్పే మా వాడిని మాకు దూరం చేసేసింది. వేణు మాధవ్ ఎప్పుడు ఏ జబ్బు వచ్చినా మందులు వేసుకునే వాడు కాదు. చిన్నప్పటి నుంచి అదే అలవాటు వచ్చింది. అదే పెద్దయ్యాక కూడా కొంప ముంచింది. డెంగ్యూ జ్వరం రావడం.. మందులు వాడకపోవడం వల్లే నా బిడ్డ చనిపోయాడు’ అని వాపోయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *