Headlines

Vande Bharat Food Issue: వందే భారత్ రైలులో షాకింగ్ ఘటన.. ముంబై డాక్టర్ ఫిర్యాదుతో రైల్వే సీరియస్.. ఐఆర్‌సీటీసీ భారీ జరిమానా!

Vande Bharat Food Issue: వందే భారత్ రైలులో షాకింగ్ ఘటన.. ముంబై డాక్టర్ ఫిర్యాదుతో రైల్వే సీరియస్.. ఐఆర్‌సీటీసీ భారీ జరిమానా!


దేశంలో అత్యంత వేగవంతమైన, విలాసవంతమైన రైలుగా గుర్తింపు పొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు రైల్వే శాఖను కలవరపెడుతున్నాయి. తాజాగా రాణి కమలాపతి – జబల్‌పూర్ వందే భారత్ రైలులో చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముంబైకి చెందిన ఒక ప్రముఖ వైద్యుడు వందే భారత్ రైలులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా వెళ్లే క్రమంలో రైల్వే సిబ్బంది ఆయనకు అల్పాహారం (Breakfast) వడ్డించారు. అయితే, ఆ ఆహారాన్ని తినబోతుండగా అందులో ఒక చనిపోయిన ఈగ కనిపించడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని రైలులోని క్యాటరింగ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, ఆ ఆహారం ఫోటోలను తీసి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రైల్వే శాఖకు ఫిర్యాదు చేశారు.

వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయని, అందుకు తగ్గట్లుగా నాణ్యమైన సేవలు అందించడంలో రైల్వే విఫలమవుతోందని సదరు వైద్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఆరోగ్యకరమైన ప్రయాణం కోసం ఇన్ని డబ్బులు వెచ్చిస్తే, చివరకు లభించేది అపరిశుభ్రమైన ఆహారమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఈ పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఫిర్యాదు అందిన వెంటనే భారతీయ రైల్వే, ఐఆర్‌సిటిసి (IRCTC) అధికారులు స్పందించారు. ప్రాథమిక విచారణ అనంతరం, ఆహార తయారీలో అశ్రద్ధ వహించినందుకు గాను సంబంధిత క్యాటరింగ్ కాంట్రాక్టరుపై లక్ష రూపాయల జరిమానా విధించినట్లు సమాచారం. అలాగే, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించారు.

వీడియో ఇక్కడ చూడండి…

రైల్వేలో ఆహార నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు జరగడం ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి రైళ్లలో పరిశుభ్రతపై కఠినమైన పర్యవేక్షణ ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, క్యాటరింగ్ యూనిట్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఏది ఏమైన ఈ ఘటన మరోసారి రైల్వే క్యాటరింగ్ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపింది. భవిష్యత్తులో ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని, ప్రయాణికుల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *