Headlines

UPSC సివిల్స్ 2026 ఇంటర్వ్యూ తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్ ఇదే


న్యూఢిల్లీ, నవంబర్ 19: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (UPSC CSE) 2026 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చింది. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) షెడ్యూల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఇంటర్వ్యూకు అర్హత సాధించిన 2,526 మంది అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఇంటర్వ్యూ తేదీలను తెలుసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూలు 2026 డిసెంబర్ 7 నుంచి 2027 ఫిబ్రవరి 12 వరకు జరగనున్నాయి.

డిసెంబర్ 7 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం

యూపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్‌లు దిల్లీలోని ధోల్‌పూర్ హౌస్, షాజహాన్ రోడ్డులో ఉన్న కమిషన్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు వేర్వేరు రిపోర్టింగ్ సమయాలను నిర్ణయించారు.

  • ఉదయం సెషన్ అభ్యర్థులు: ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలి.
  • మధ్యాహ్నం సెషన్ అభ్యర్థులు: మధ్యాహ్నం ఒంటి గంటకు రిపోర్ట్ చేయాలి.

ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులు 2026 నవంబర్ 11 నుంచి నవంబర్ 25లోగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియను ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా వివరాలను సమర్పించని అభ్యర్థులకు ఈ-సమ్మన్ లెటర్లు జారీ చేయరు. అంతేకాకుండా ఇంటర్వ్యూకు కూడా అనుమతించరు. కాబట్టి అర్హత సాధించిన అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ తేదీ, సమయం తదితర వివరాలను యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించవచ్చు. సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్ఠాత్మక ఉద్యోగాలను సాధించాలనుకునే అభ్యర్థులకు ఇంటర్వ్యూ అత్యంత కీలకమైన దశ. అభ్యర్థులు తమ తేదీలను ముందుగానే తెలుసుకుని పర్సనాలిటీ టెస్ట్‌కు సన్నద్ధం కావాలి.

ఇవి కూడా చదవండి



యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ 2026 ఇంటర్వ్యూ పూర్తి షెడ్యూల్‌, దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *