Headlines

Actress : చిరంజీవి, నాగార్జునతో బ్లాక్ బస్టర్ సినిమాలు.. 51 ఏళ్ల వయసులో ఒంటరిగా అలనాటి గ్లామర్ హీరోయిన్..


ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ముద్దుగుమ్మలలో నగ్మా ఒకరు. అందం, అభినయంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి విశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాలలో మంచి విజయాలు అందుకున్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి విషయంపై తరచూ చర్చలు సాగుతూనే ఉంటాయి. ఇప్పటికీ నగ్మా వివాహం చేసుకోకుండా ఉండటం వెనుక కారణాలేమిటనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె వయసు 51 సంవత్సరాలు. సినీరంగానికి దూరంగా ఒంటరిగా జీవిస్తుంది. నగ్మా తెలుగు, తమిళ చిత్రాలతో పాటు కన్నడ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ‘కురుబన రాణి’, డా. విష్ణువర్ధన్‌తో కలిసి నటించిన ‘హృదయవంత’, అలాగే ‘రవిమామ’ వంటి చిత్రాలతో కన్నడ సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. విభిన్న భాషల్లో అనేక ప్రాజెక్టులు చేస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలతో హిట్స్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

ఇదిలా ఉంటే.. నగ్మా కెరీర్ జోరుగా సాగుతున్న రోజుల్లో ఆమె పేరు తమిళ నటుడితో ముడిపడి వినిపించింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ బంధం వివాహం వరకు వెళ్లలేదు. ఆ నటుడు మరో హీరోయిన్ ను పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరి గురించి అనేక చర్చలు నడిచాయి. ఆ తర్వాత ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పేరు కూడా నగ్మాతో కలిసి వార్తల్లో నిలిచింది. వీరి మధ్య సాన్నిహిత్యం ఉందంటూ రూమర్లు వచ్చినా, ఇద్దరూ ఆ విషయంపై బహిరంగంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

సినిమాల తర్వాత రాజకీయ రంగంలోనూ నగ్మా చురుగ్గా వ్యవహరించారు. ఇక ఆమె వివాహం చేసుకోకపోవడానికి ఏదైనా నిర్దిష్ట ప్రేమ వైఫల్యమే కారణమని ఖచ్చితంగా చెప్పడానికి ఆధారాలు లేవు. పెళ్లి చేసుకోకపోవడం అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయంగానే కనిపిస్తోంది. సినీ రంగం నుంచి రాజకీయాల వరకు తనదైన గుర్తింపు తెచ్చుకున్న నగ్మా వ్యక్తిగత జీవితంపై అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి నెలకొనే ఉంటుంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

నగ్మా..

Nagma Movies

Nagma Movies

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *