Headlines

Upasana: నాన్న.. పిల్లల డైపర్ మారిస్తే పెద్ద గొప్పేం కాదు’ పిల్లల పెంపకంపై ఉపాసన కామెంట్స్


విశాఖపట్నంలో జరిగిన ‘సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2026’ లో, టాలీవుడ్‌ నటుడు రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ఆంధ్రప్రదేశ్‌ ఐటీ అండ్‌ మానవ వనరుల అభివృద్ధి శాక మంత్రి నారా లోకేశ్‌ని కలిశారు. ఆ సందర్భంగా ఆమె పిల్లల పెంపకంలో సమాజం చూపే వివక్ష గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లులు, తండ్రులు తమ బాధ్యతలను పంచుకుంటున్నప్పుడు సమాజం చాలా భిన్నంగా చూస్తోందన్నారు. తండ్రి బిడ్డకు అన్నం తినిపించినా? లేదా డైపర్‌ మార్చినా..?అందరు చప్పట్లు కొడతూ మంచి తండ్రి అని పొగిడేస్తారు. అదే పని తల్లి చేస్తే..అది చాలా సర్వసాధారణ విషయంగా చూస్తారు. పైగా మాట వరసకు కూడా అభినందించరు. ఇంట్లోనే ఇలాంటి దృక్పథం ఉంటే..కార్యాలయంలో, పనిచేసే చోట ఇంకెక్కడ మార్పు అని ప్రశ్నించారామె. మనందరం దీనిపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. మన విద్యా విధానంలో ప్రజల ఆలోచన దృక్పథం భాగం కావాలి. అయినా తండ్రి ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఉపకారం చేయడం లేదు, ఆయన తన పిల్లల బాధ్యతలనే నిర్వర్తిస్తున్నాడని గ్రహించండని పిలుపునిస్తోందామె. మనందరి ఆలోచన తీరు మారాలి. అప్పుడు విద్యావ్యవస్థలో కూడా ఆ మార్పు వస్తుంది. మనం పిల్లలను కూడా ఇలాగే పెంచాలన్నారామె. అలాగే కొడుకులు మంచి పనులు చేసినప్పుడు తల్లులు కూడా దాన్ని పెద్ద విషయంగా పరిగణించకుండా..సర్వసాధారణమైన విషయంగా తీసుకుంటే..మొత్తం వ్యవస్థ పురోగమిస్తుందన్నారు. ఒక భార్యగా కొన్నిసార్లు తాను కూడా ఆ విధంగానే స్పందిస్తుంటానని అన్నారు. ఆయన పిల్లలకు తినిపిస్తుంటే తనకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అది చాలా సాధారణ విషయమే కదా అనిపిస్తోందని చెప్పుకొచ్చింది. నిజానికి పిల్లలను పెంచే క్రమంలో పేరెంట్స్‌ ఇద్దరూ ఇలా చేయడం సహజమే అంటూ పిల్లలపెంపకంపై చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారామె. కాగా, రామ్‌చరణ​ ఉపాసన దంపతులు 2023లో క్లిన్‌కారాకు జన్మనివ్వగా ఈ ఏడాదిలోనే మరో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rohith Naidu: హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై.. రోహిత్ నాయుడు నుంచి కీలక నోట్!

Ramayana: సీత యోధురాలే.. నా రామాయణ నిజమే! సాక్ష్యాలతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్

సినిమా కోసం.. అమెరికాలో IT జాబ్‌కి రిజైన్‌! ఇంట్రెస్టింగ్‌గా సాత్విక స్టోరీ!

Temper Vamsi: టెంపర్ వంశీని బిగ్ బాస్‌లో ఉంచేందుకు.. పూరీ జగన్నాథ్‌ రోజూ కష్టపడుతున్నాడట!

తండ్రి Vs కొడుకు.. బాక్సాఫీస్ వద్ద విచిత్ర పోరు!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *