తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి సేవకుల పనితీరు ఆధారంగా ‘సిబిల్ స్కోర్’ తరహాలో రేటింగ్ ఇచ్చే నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎం.రవిచంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను గ్రామస్థాయి వరకు విస్తరించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సుమారు 50 వేల ఆలయాలలో శ్రీవారి సేవ ద్వారా భక్తులకు మెరుగైన సేవలు అందించే అవకాశాలను గుర్తిస్తున్నట్లు ఈవో వివరించారు. సేవకుల పనితీరుకు ఇచ్చే రేటింగ్ ఆధారంగానే ఇకపై వారికి విధులు కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసినట్లు టీటీడీ ప్రకటించింది. శుక్రవారం నాటి దర్శనం కోసం గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఏసీ కోచ్‌లో నూనె దీపంతో పూజలు.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!
మృగాన్నే అయినా.. నేనూ అమ్మనే.. కొంచెం ఆగండి!