Headlines

Jana Nayagan: 4 రోజుల్లోనే రూ. 220 కోట్లు వసూలు చేసిన జననాయగన్

Jana Nayagan: 4 రోజుల్లోనే రూ. 220 కోట్లు వసూలు చేసిన జననాయగన్


200 కోట్లు అంటే అంత ఈజీనా..? చెప్పులేసుకున్నంత సులభంగా.. మంచి నీళ్లు తాగినంత ఈజీగా వసూలు చేయొచ్చా..? సౌత్ ఇండియాలో కొందరు హీరోలను.. వాళ్ల స్టార్ డమ్‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. తాజాగా ఓ హీరో అయితే ఏకంగా వరుసగా 9వ సారి 200 కోట్ల క్లబ్బులో చేరిపోయారు. మరి ఆ స్థాయిలో దండయాత్ర చేస్తున్న హీరో ఎవరు..? ఇంతకీ అత్యధిక 200 కోట్ల సినిమాలెవరికి ఉన్నాయి..? బాక్సాఫీస్ రికార్డుల వేటలో విజయ్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు.. వరసగా 9వ సారి 200 కోట్ల క్లబ్బులో చేరిపోయారీయన. కెరీర్‌లో చివరి సినిమాగా వచ్చిన జన నాయగన్ కేవలం 4 రోజుల్లోనే 220 కోట్లకు పైగా వసూలు చేసింది. తమిళనాడు ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ మార్కెట్ కూడా విజయ్‌కు ప్రతిసారి బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ వసూళ్లు సాధ్యమవుతున్నాయి. 2017లో వచ్చిన మెర్సల్ సినిమాతో మొదటిసారి 200 కోట్ల మార్క్ టచ్ చేశారు.. ఆ తర్వాత వచ్చిన సర్కార్, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు, లియో, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాలు కూడా హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా 200 కోట్ల మార్క్ దాటేసాయి. సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా సరే.. తన స్టార్‌డమ్‌తో వరసగా ఈ అరుదైన ఫీట్ సాధించిన ఏకైక సౌత్ హీరోగా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయ్ తర్వాత స్థానంలో రజినీకాంత్ ఉన్నారు. ఈయన 8 సార్లు 200 కోట్ల క్లబ్బులో చేరారు. 2010లో వచ్చిన రోబోతో ఫస్ట్ టైమ్ డబుల్ సెంచరీ కొట్టిన సూపర్ స్టార్.. తర్వాత 2.ఓ, జైలర్, కబాలి, పేట, దర్బార్, వేట్టయాన్, కూలీ సినిమాలతో 200 కోట్ల మైలురాయిని అందుకున్నారు. కాకపోతే విజయ్ చేసినట్లు వరుసగా ఈ ఫీట్ చేయలేకపోయారు రజినీకాంత్. ప్రస్తుతం జైలర్ 2, ధర్మన్ సినిమాలతో బిజీగా ఉన్నారీయన. టాలీవుడ్ నుంచి అత్యధిక 200 కోట్ల సినిమాలున్నది ప్రభాస్ ఒక్కరికే. బాహుబలి ది బిగినింగ్‌తో ఫస్ట్ టైం 200 కోట్ల మార్క్ టచ్ చేసిన ఈయన.. బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి, రాజా సాబ్ సినిమాలతో డబుల్ సెంచరీలు బాదేసారు. టాక్‌తో పనిలేకుండా కేవలం ప్రభాస్ కటౌట్‌కే బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వస్తున్నాయి. ప్రస్తుతం కల్కి 2తో పాటు స్పిరిట్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..

తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!

మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్

భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌లో చూపించిన భర్త!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *