హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 29వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో మొత్తం 5,26,166 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. ఇందులో 4,91,774 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5,538 మంది విద్యార్ధులు ఈ పరీక్షల్లో తప్పారు. ఫెయిల్ అయిన విద్యార్ధులతోపాటు స్కోర్ పెంచుకోవాలనుకునే విద్యార్ధుల కోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఎస్సెస్సీ బోర్డు) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. తాజా టైం టేబుల్ ప్రకారం ఈ పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 12వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఆయా తేదీల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.
తెలంగాణ టెన్త్ 2026 అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల పూర్తి టైమ్ టేబుల్ ఇదే
- జూన్ 5 (శుక్రవారం)వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ ఏ), కాంపోజిట్ కోర్సు పరీక్ష
- జూన్ 6 (శనివారం)వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
- జూన్ 7 (ఆదివారం)వ తేదీన థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) పరీక్ష
- జూన్ 8 (సోమవారం)వ తేదీన మ్యాథమెటిక్స్ పరీక్ష
- జూన్ 9 (మంగళవారం)వ తేదీన సైన్స్ పార్ట్ 1 (ఫిజికల్ సైన్స్) పరీక్ష
- జూన్ 10 (బుధవారం)వ తేదీన సైన్స్ పార్ట్ 2 (బయోలాజికల్ సైన్స్) పరీక్ష
- జూన్ 11 (గురువారం)వ తేదీన సోషల్ స్టడీస్, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ పేపర్ 1 పరీక్ష
- జూన్ 12 (శుక్రవారం)వ తేదీన ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్ష
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ రోజు (ఏప్రిల్ 30) నుంచి మే 14 వరకు పరీక్షా ఫీజును చెల్లించవచ్చు. సకాలంలో ఫీజు చెల్లించి విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఫలితాల్లో మార్కులపై ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్ ఫీజు ఒక సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.