ఒక చిన్నారి పాఠశాల విద్యార్థి తన ఉపాధ్యాయురాలిని బెదిరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “స్కూలు కూల్చేస్తా” అంటూ ఆ పసివాడు చేసిన హెచ్చరిక నెటిజన్లను ఒకవైపు నవ్విస్తుండగా, మరోవైపు చర్చకు దారితీస్తోంది. బీహార్‌కు చెందిన పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
@gharkekalesh అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో, ఒక చిన్న బాలుడు క్లాస్రూమ్ తలుపు దగ్గర నిలబడి అత్యంత కోపంతో ఊగిపోతూ కనిపించాడు. టీచర్ తనను చదువుకోమని చెప్పడమే ఆ బాలుడి ఆగ్రహానికి కారణం. కోపంతో ఎర్రబడిన ముఖంతో, గట్టిగా అరుస్తూ “తుర్ దేబ్… తోర్ స్కూలియే తోర్ దేబ్” (నేను నీ స్కూలును పగలగొట్టేస్తా, నాశనం చేస్తా) అని స్థానిక బీహారీ యాసలో హెచ్చరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
వీడియోలో ఉపాధ్యాయుడు అతడిని శాంతపరచడానికి ప్రయత్నిస్తూ, “మర్యాదగా మాట్లాడు, వాడిని పట్టుకోండి” అని ఇతర విద్యార్థులతో చెప్పారు. అప్పుడు మరో విద్యార్థి ఆ బాలుడిని పట్టుకుని టీచర్ ముందుకు తీసుకురాగా, అతను “చదువుకోమంటే ఎందుకు అంత కోపం?” అని అడిగారు. అయినప్పటికీ ఆ చిన్నారి తగ్గకుండా అదే దూకుడుతో ఉపాధ్యాయుడి వైపు చూస్తూ మళ్ళీ బెదిరింపులకు దిగడం క్లిప్‌లో కనిపించింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రెండు రకాల చర్చలకు వేదికైంది. “ఈ పిల్లాడు భవిష్యత్తులో పెద్ద నాయకుడు అవుతాడు”, “వాడి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు” అంటూ చాలా మంది ఫన్నీ కామెంట్లతో నవ్వుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఇది హాస్యాస్పదం కాదని అభిప్రాయపడుతున్నారు. “పిల్లాడు కోపంతో వణికిపోతున్నాడు, అతడికి సరైన క్రమశిక్షణ, ప్రేమ అవసరం” అని కొందరు, “గురువుల పట్ల భయం లేకపోవడం సమాజానికి మంచిది కాదు” అని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
Wholesome Kalesh b/w Student and Teacher (When the teacher asked the kid to study, he replied, “i will break your school!” and the whole class burst out laughing) pic.twitter.com/iJBhvibY8l
— Ghar Ke Kalesh (@gharkekalesh) April 29, 2026
ఈ వీడియో పాతదా లేక కొత్తదా అన్నది స్పష్టంగా తెలియనప్పటికీ, ఆ చిన్నారి ‘రౌడీ’ ప్రవర్తన మాత్రం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. పెంపకంలో లోపమా లేక చిన్నపిల్లల అమాయకపు కోపమా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..