ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు మరో చేదు అనుభవం ఎదురైంది. సొంతగడ్డపై, వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై పరాజయం పాలైంది. రియాన్ రికెల్టన్ అద్భుత సెంచరీ(123)తో ముంబై 243 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, దాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఓటమితో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు వెళ్లగా, ముంబై ఆశలు సంక్లిష్టంగా మారాయి.
మ్యాచ్ అనంతరం తన జట్టు ప్రదర్శనపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “బ్యాటింగ్ పరంగా మేము అద్భుతమైన స్కోరు సాధించాం. 244 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేదించలేదని అనుకున్నాం. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తారని ఆశించాను. కానీ దానికి విరుద్ధంగా సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మాపై ఎదురుదాడికి దిగారు. పవర్ ప్లేలో 92 పరుగులు ఇవ్వడం మా ఓటమికి పునాది వేసింది” అని హార్దిక్ పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఫీల్డింగ్‌లో క్యాచ్‌లను జారవిడవడం కూడా ఓటమిపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన అన్నారు. “క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు. కానీ మేము కీలక సమయంలో క్యాచ్‌లు వదిలేసి భారీ మూల్యం చెల్లించుకున్నాం. బౌలింగ్లో మా ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు, ప్రస్తుతం మా వద్ద ప్రత్యామ్నాయ బౌలింగ్ ఆప్షన్లు కూడా తక్కువగా ఉన్నాయి” అని అన్నారు. చివరగా, స్టేడియంలో ప్రేక్షకులు ప్రత్యర్థి ఆటగాళ్ల పేర్లతో నినాదాలు చేయడంపై హార్దిక్ బాధపడుతూ, “ముంబై ప్రేక్షకుల ప్రేమను మేము కోల్పోయామా అనిపిస్తోంది, ఇది చాలా బాధగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు. వారిని కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాం. ప్రేమను పొందుతామని హార్దిక్ అన్నారు.
🚨 MUMBAI INDIANS LOSE 4 CONSECUTIVE MATCHES AT THE WANKHEDE FOR THE FIRST TIME IN IPL HISTORY. 🚨 pic.twitter.com/2FBEnQ81B7
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 29, 2026
Also Read: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..