Headlines

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!

Trisha: విజయ్‌ మౌనం నాకు నచ్చదు..!


ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ఘన విజయాన్ని సాధించారు నటుడు విజయ్‌. తమిళ ప్రజలు టీవీకే పార్టీకి స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ విజయ్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సమస్యలొస్తున్నాయి. విజయ్ మౌనంగా ఉండటం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఆయనతో కలిసి 5 సినిమాల్లో నటించిన త్రిష గతంలో విజయ్‌ మౌనంపై చేసిన కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి. విజయ్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తాడనీ ఒక్క మాటలో చెప్పాలంటే ‘సైలెంట్ కిల్లర్’ అనీ త్రిష ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. విజయ్‌ ఏమీ చెప్పకుండానే ఆయన్ని అందరూ ఇష్టపడతారనీ ‘గిల్లి’ సినిమా సమయంలో తమ ఇద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉండేది కాదనీ త్రిష తెలిపారు. దర్శకుడు ధరణి, టీమ్ వల్ల తాము మంచి స్నేహితులమయ్యామనీ అన్నారు. విజయ్ చాలా మంచి వ్యక్తి అనీ ఎప్పుడూ సహనంతో ఉంటాడనీ తన జీవితంలో తను ఎప్పుడూ ఇష్టపడే వ్యక్తుల్లో విజయ్‌ ఒకరని కామెంట్‌ చేసారు. సెట్‌లో ఉన్నప్పుడు విజయ్ అందరితో మాట్లాడకుండా ఓ మూల కూర్చొని గంటల తరబడి గోడ వైపు చూస్తూ ఉంటాడనీ తనకు ఆ మౌనం నచ్చదనీ చెప్పారు. తన దృష్టిలో హోమ్‌ అంటే ఇల్లు మాత్రమే కాదు ఓ వ్యక్తి అనీ తనకు అలాంటి వ్యక్తి విజయ్‌ అనీ అతడితో ఉంటే తనకు చాలా సేఫ్టీగా అనిపిస్తుందనీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ సంక్షోభం నడుస్తున్న తరుణంలో.. త్రిష అన్నట్లుగానే తన ‘మౌనం’తోనే విజయ్ ఎలాంటి ఎత్తుగడలు వేయబోతున్నారో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్రిష పక్కనుంటే ఇక అంతే.. విజయ్‌ భవిష్యత్తు పై జోస్యం చెప్పిన వేణు స్వామి

కోలీవుడ్‌లో నెక్స్ట్ దళపతి ఎవరు ?? యువ హీరోలకు సవాళ్లు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *