విషు పండుగలో అత్యంత కీలకమైన ‘విషు కని’ (Vishu Kani) గురించి ఆమె వివరిస్తూ.. ఉదయాన్నే కళ్ళు మూసుకుని వచ్చి దేవుడి ముందు అమర్చిన పండ్లు, పువ్వులు, బంగారం, అద్దాన్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి అని అన్నారు. ఆ ఏడాది మొత్తం శుభప్రదంగా గడవాలని కోరుకుంటూ చూసే ఆ దృశ్యం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.