Gold Price: గంటల్లోనే మారిన రేట్లు.. వేలల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. అక్షయతృతీయ వేళ బిగ్ షాక్..

Gold Price: గంటల్లోనే మారిన రేట్లు.. వేలల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. అక్షయతృతీయ వేళ బిగ్ షాక్..


Gold Price: గంటల్లోనే మారిన రేట్లు.. వేలల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. అక్షయతృతీయ వేళ బిగ్ షాక్..

పసిడి ప్రియులకు షాకిస్తూ బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగాగంటల వ్యవధిలోనే ధరల్లో భారీ మార్పు కనిపించింది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, చెన్నై, ఢిల్లీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.810 పెరిగి రూ.1,55,780 కు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి రూ.1,42,800 వద్ద కొనసాగుతోంది. కేవలం గ్రాము బంగారంపైనే దాదాపు రూ.75 నుండి రూ.81 వరకు పెరుగుదల కనిపించడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది.

విజయవాడలో కూడా హైదరాబాద్‌కు సమానంగా ధరలు ఉండగా, చెన్నైలో పసిడి రేట్లు మరికాస్త ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,56,160 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ధరలు పెరిగి రూ.1,55,930 మార్కును తాకాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరగడం, అంతర్జాతీయంగా డాలర్ విలువలో మార్పులు ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

బంగారంతో పాటు వెండి కూడా తన జోరును కొనసాగిస్తోంది. హైదరాబాద్‌లో వెండి ధర ఏకంగా రూ.5000 పెరిగింది. ఉదయం రూ.2,75,000గా ఉన్న వెండి.. ఇప్పుడు రూ.2,80,000కు పెరిగింది. విజయవాడ, వైజాగ్ నగరాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి. అటు ఢిల్లీలో వెండి ధర ఏకంగా రూ.10,000 పెరిగింది. ఉదయం రూ.2,65,000 ఉన్న వెండి ఇప్పుడు రూ.2,75,000గా ఉంది. పసిడి ధరలు ఇలాగే పెరిగితే రానున్న రోజుల్లో మరింత భారమయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *